కాసేపట్లో మీడియా ముందుకు కేసీఆర్... ఏం మాట్లాడతారో, ప్రజల్లో ఉత్కంఠ

Siva Kodati |  
Published : Nov 03, 2022, 07:07 PM IST
కాసేపట్లో మీడియా ముందుకు కేసీఆర్... ఏం మాట్లాడతారో, ప్రజల్లో ఉత్కంఠ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాత్రి 8 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. నిజానికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిన రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాత్రి 8 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మునుగోడు ఉపఎన్నికతో పాటు పాటు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్త ఆధారాలు ఏమైనా కేసీఆర్ బహిర్గతపరచే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ వివరిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిన రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎందుకో ఆ ఆలోచన విరమించుకున్నారు ముఖ్యమంత్రి. 

అయితే మునుగోడు  అసెంబ్లీ నియోజకవర్గంలోని  చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్  ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడ్డారు. మొయినాబాద్ ఫాం హౌస్  లో నలగురు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు గురి చేసిన ఘటన వెనుక ఎవరున్నారో బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణా ఆత్మగౌరవాన్ని కొందామని వస్తే ఎడమకాలితో తన్ని వచ్చారన్నారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని చెప్పుతో కొట్టినట్టుగా నలుగురు ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని కేసీఆర్  ఆ  నలుగురిని అభినందించారు.. 

ALso REad:ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు:చండూరులో బీజేపీపై కేసీఆర్ ఫైర్

ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక  ఎవరున్నారో ఒక్క క్షణం కూడ పదవుల్లో ఉండడానికి వీల్లేదని ఆయన  పరోక్షంగా మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల  కొనుగోలుకు మోడీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలన్నారు. మోడీ అండదండలు  లేకుండా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు హైద్రాబాద్ కు వచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారా  అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు  వందల కోట్లు  ఎక్కడి  నుండి  వచ్చాయని  ఆయన   ప్రశ్నించారు.  ఇంకా మీకు ఏం కావాలని  ఆయన  ప్రధాని  మోడీని ప్రశ్నించారు.రెండు సార్లు  ప్రధానిగా బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఇలాంటి అరాచకాలను ఎందుకు  ప్రోత్సహిస్తున్నారో  చెప్పాలని  ఆయన ప్రశ్నించారు. ఇంత అరాచకం జరుగుతుంటే  మౌనంగా ఉందామా అని  ఆయన  అడిగారు.

20,30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ను పడగొట్టాలని చూశారన్నారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ వస్తే కేసీఆర్ ను పక్కకు జరుపుతారన్నారు.  అందుకే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.రాజకీయం  అంటే అమ్ముడుపోవడం కాదని తమ పార్టీ ఎమ్మెల్యేలు నిరూపించారన్నారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో వచ్చి చంచల్  గూడ  జైలులో ఉన్నారని కేసీఆర్ చెప్పారు.ఎమ్మెల్యేల  కొనుగోళ్ల వ్యవహరంలో మీరు చూసింది చిన్నదేనన్నారు. చూడాల్సింది ఇంకా చాలా ఉందని కేసీఆర్  చెప్పారు.ఢిల్లీ పీఠం బద్దలవ్వాల్సింది చాలా  ఉందని కేసీఆర్  తెలిపారు.రాబోయే రోజుల్లో అన్నీ విషయాలు బయటపడతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఈ కేసు  కోర్టులో ఉన్నందున తాను  ఈ విషయమై ఎక్కువగా  మాట్లాడబోనన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu