రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

Siva Kodati |  
Published : Nov 03, 2022, 05:25 PM IST
రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

సారాంశం

ధారూర్ మండలం బాచారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెద్దెముల్ మండల బాధితులను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభుతి ప్రకటించిన ఆయన.. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ధారూర్ మండలం బాచారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెద్దెముల్ మండల బాధితులను మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం పరామర్శించారు. కూలి కోసం వికారాబాద్‌కు ఆటోలో వెళ్తుండగా జరిగిన ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు మహేందర్ రెడ్డి. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు గాయాలపాలైయ్యారు. గాయపడిన బాధితులను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా అక్కడ వారిని పరామర్శించారు మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా సరైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు మహేందర్ రెడ్డి. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభుతి ప్రకటించిన ఆయన.. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?