తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటులను కోల్పోవడం బాధాకరం: కైకాలకు కేసీఆర్ నివాళులు

By narsimha lode  |  First Published Dec 23, 2022, 3:23 PM IST

ప్రముఖ సినీ నటులు  కైకాల సత్యనారాయణ  పార్థీవ దేహనికి తెలంగాణ సీఎం కేసీఆర్  ఇవాళ నివాళులర్పించారు. 
 


హైదరాబాద్: తెలుగు చలనచిత్ర  పరిశ్రమ సీనియర్ నటులను  కోల్పోవడం  బాధాకరణమని తెలంగాణ సీఎం కేసీఆర్  అన్నారు.ప్రముఖ సినీ నటులు  కైకాల సత్యనారాయణ పార్థీవ దేహనికి తెలంగాణ సీఎం కేసీఆర్  శుక్రవారం నాడు నివాళులర్పించారు.  సత్యనారాయణ కుటుంబసభ్యులను సీఎం ఓదార్చారు.  సత్యనారాయణ  మృతికి దారి తీసిన  పరిస్థితులను  సీఎం  అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కైకాల సతస్యనారాయణ  మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటని  సీఎం కేసీఆర్ చెప్పారు. సినిమా రంగంలో  కైకాల సత్యనారాయణ అద్భుతమైన పేరును తెచ్చుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఎంపీగా  పనిచేసిన  కాలంలో  ఆయన అనుభవాలను  పంచుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు  చేసుకున్నారు.గతంలో  కైకాల  సత్యనారాయణతో  కలిసి పనిచేసినట్టుగా  కేసీఆర్ ప్రస్తావించారు. అనేక మంది హీరోలతో  సత్యనారాయణ ,నటించారన్నారు.  ఆయన నటించిన కొన్ని పాత్రలు మంచి గుర్తింపును తీసుకువచ్చినట్టుగా  సీఎం తెలిపారు.

Latest Videos

also read:మూడు తరాలకు గుర్తుండే నటుడు: కైకాల సత్యనారాయణకు మంత్రి తలసాని నివాళులు

కొంత కాలంగా  సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఇవాళ తన స్వగృహంలోనే ఆయన  తుదిశ్వాస విడిచారు. గతంలో కరోనా బారిన పడిన  కైకాల సత్యనారాయణ ఆసుపత్రిలో  చికిత్స పొందిన తర్వాత  ఇంటికి చేరుకున్నారు. కరోనా చికిత్స పొందిన  తర్వాత  ఆయనకు  అనారోగ్య సమస్యలు తల్తెత్తాయి. దీంతో ఇంట్లోనే  ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,   ఎమ్మెల్సీలు  పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి,  జూబ్లీహిల్స్  ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్  తదితరులున్నారు. 
 

click me!