మంచిర్యాల ఆరుగురు సజీవ దహనం కేసు: ముగ్గురు నిందితులకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

మంచిర్యాలలో  ఆరుగురి సజీవ దహనం కేసులో  ముగ్గురిని పోలీస్ కస్టడీకి ఇస్తూ  కోర్టు  శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది.  


ఆదిలాబాద్: మంచిర్యాలలో  ఆరుగురి సజీవ దహనం కేసులో  ముగ్గురిని  పోలీస్ కస్టడీకి ఇస్తూ  శుక్రవారం నాడు  కోర్టు అనుమతిని ఇచ్చింది.  ఈ కేసులో నిందితులను వారం రోజుల పాటు  కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు  కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో  ముగ్గురు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది.  దీంతో  నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని ఈ కేసును విచారించనున్నారు.

మంచిర్యాల మండలం వెంకటాపూర్  లో   వారం రోజుల క్రితం  ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రలోనే  ఆరుగురు  సజీవ దహనమయ్యారు.  ఈ కేసులో నిందితులను ఇటీవలనే పోలీసులు అరెస్ట్  చేశారు.   నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే  ఈ కేసులో ఇంకా కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందని  పోలీసులు భావించారు. దీంతో నిందితులను  కస్టడీ కోరుతూ  పోలీసులు  కోర్టులో కస్టడీ పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ కేసులో  ఏ1 లక్ష్మణ్, ఏ3 రమేష్, ఏ 4 రమేష్ లను పోలీస్ కస్టడీకి   కోర్టు అనుమతిని  ఇచ్చింది. ఈ కేసులో  ఇప్పటికే  ఐదుగురిని  పోలీసులు రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే.

Latest Videos

ఈ నెల  17న వెంకటాపూర్ లో నిందితులు  ఆరుగురిని సజీవదహనం చేశారు. వెంకటాపూర్  కు చెందిన  శివయ్య, పద్మ అలియాస్ రాజ్యలక్ష్మి దంపతులకు  ఇద్దరు పిల్లలున్నారు.   శివయ్య  వీఆర్ఏగా పనిచేస్తున్నాడు.  ఈ దంపతులు  వెంకటాపూర్ లో ఉంటున్నారు. పద్మకు  సింగరేణిలో  పనిచేసే శాంతయ్య తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో  శాంతయ్యకు ఆయన భార్య  సృజనకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.  శాంతయ్య  పద్మ ఇంట్లోనే ఉంటున్నాడు.   మెడికల్  ఆన్ ఫిట్ గా మారితే  శాంతయ్య  ఉద్యోగం ఆయన కుటుంబంలో  ఒకరికి దక్కే అవకాశం ఉంది. దీంతో  శాంతయ్యను ఆయన భార్యా పిల్లలు  ఈ విషయమై  ఒత్తిడి తీసుకు వచ్చారు. ఇటీవలనే శాంతయ్య  ఓ భూమిని విక్రయించాడు.  ఆ డబ్బులను కూడా  తమకు ఇవ్వకుండా  పద్మకు ఇచ్చాడని సృజన అనుమానించింది.  మరో వైపు సృజన మరో వ్యక్తితో  వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.దీంతో శాంతయ్యను హత్య చేయాలని  సృజన ప్లాన్  చేసిందని  పోలీసులు తెలిపారు.

లక్సెట్టిపేటకు  చెందిన లక్ష్మణ్, రమేష్ , గుడిపల్లికి చెందిన సమ్మయ్య, గోదావరిఖనికి  చెందిన అంజయ్యలతో  కలిసి హత్యకు ప్లాన్  చేశారని  పోలీసులు  వివరించారు. చివరకు ఈ నెల  17న నిందితులు  శాంతయ్య సహా   మరో ఆరుగురిని  హత్య చేశారని  రామగుండం  సీపీ  వివరించారు.

also read:మంచిర్యాల సజీవ దహనం కేసు : వారం రోజులుగా రెక్కీ చేసి, సమాచారం కోసం సుపారీ ఇచ్చీ.. విచారణలో షాకింగ్ విషయాలు..

శాంతయ్యను  హత్య చేసేందుకు  పలు మార్లు  ప్లాన్ చేసి విఫమయ్యారు.  శాంతయ్యను వాహనంతో ఢీకొట్టి చంపాలని చేసిన పథకాలు  ఫెయిలయ్యాయి. దీంతో  గుడిపల్లి వెంకటాపూర్  లో  శాంతయ్య  ఉన్న ఇంటిపై  పెట్రోల్ పోసి దగ్దం  చేశారు. అగ్ని ప్రమాదంగా  చిత్రీకరించాలని భావించారు. అయితే  ఈ ఇంటికి  సమీపంలోని ఆటోలో  పెట్రోల్ క్యాన్లు, కారం పొడి లభ్యం కావడంతో   పోలీసులు ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఆనవాళ్లను పోలీసులు గుర్తించలేదు. దీంతో  పోలీసులు  పెట్రోల్  క్యాన్ల ఆధారంగా  దర్యాప్తును ప్రారంభించారు.  సీసీటీవీ పుటేజీల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణను ప్రారంభించారు.  ఈ దృశ్యాల్లో నిందితులను గుర్తించిన పోలీసులు  వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే  అసలు విషయాలు వెలుగు చూశాయి.

click me!