సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులు: కుటుంబ సభ్యులకు కేసీఆర్ ఓదార్పు

Published : Jun 29, 2023, 01:38 PM ISTUpdated : Jun 29, 2023, 01:44 PM IST
సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులు: కుటుంబ సభ్యులకు  కేసీఆర్ ఓదార్పు

సారాంశం

సాయిచంద్ భౌతిక కాయానికి  తెలంగాణ సీఎం కేసీఆర్  ఇవాళ  నివాళులర్పించారు.  కుటుంబ సభ్యులను  ఓదార్చారు. 


హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల  కార్పోరేషన్ చైర్మెన్  సాయిచంద్  భౌతిక కాయానికి తెలంగాణ సీఎం  కేసీఆర్ గురువారంనాడు  నివాళులర్పించారు. గుండెపోటుతో  సాయిచంద్  ఇవాళ తెల్లవారుజామున  మృతి చెందాడు, సాయిచంద్ భౌతిక కాయాన్ని  ఆయన స్వగృహం గుర్రంగూడకు తరలించారు. ఇవాళ  మధ్యాహ్నం  గుర్రంగూడలోని  సాయిచంద్ నివాసానికి  కేసీఆర్ వెళ్లారు.  సాయిచంద్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.  సాయిచంద్  కుటుంబ సభ్యులను  ఓదార్చారు  కేసీఆర్. సాయిచంద్ భార్య, తల్లీదండ్రులతో  కేసీఆర్ మాట్లాడారు.  సాయిచంద్  కుటుంబ సభ్యులకు  కేసీఆర్  ధైర్యం చెప్పారు.  

also read:అలా జరిగుంటే బ్రతికేవాడివేమో తమ్ముడూ..: సాయిచంద్ మృతదేహం వద్ద కేటీఆర్ కంటతడి (వీడియో)

నాగర్ కర్నూల్ జిల్లాలోని తన ఫామ్ హౌస్ కు  నిన్న రాత్రి  కుటుంబ సభ్యులతో  సాయిచంద్ వెళ్లారు. అయితే  ఫామ్ హౌస్ లోనే  సాయిచంద్ కు గుండెపోటు  వచ్చింది.  వెంటనే అతడిని  ఆసుపత్రికి తరలించారు. హైద్రాబాద్ ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  సాయిచంద్ మృతి చెందాడు.

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్