దేవేగౌడతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ: జాతీయ రాజకీయాలపైచర్చ

By narsimha lode  |  First Published May 26, 2022, 1:53 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు మధ్యాహ్నం మాజీ  ప్రధాన మంత్రి దేవేగౌడతో బెంగుళూరులో భేటీ అయ్యారు. ప్రధాని మోడీ హైద్రాబాద్ టూర్ కి రాగా, ముందుగా నిర్ణయింంచిన షెడ్యూల్ ప్రకారంగా కేసీఆర్ బెంగుళూరుకు చేరుకున్నారు.
 


హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR  మాజీ ప్రధాని Deve Gowdaతో గురువారం నాడు మధ్యాహ్నం భేటీ అయ్యారు. కర్ణాటక మాజీ సీఎం Kumara Swamy తెలంగాణ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం  నాడు మధ్యాహ్నం Banglore కు చేరుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కానున్నారు. దేశ రాజకీయాల్లో   కీలకపాత్ర  పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు పార్టీలు, పలు రాష్ట్రాల సీఎంలతో భేటీ అవుతున్నారు. ఇవాళ మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కావడం కోసం కేసీఆర్ ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ నుండి బెంగుళూరుకు చేరుకున్నారు.

Latest Videos

undefined

ఇవాళ మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవేగౌడ నివాసంలోనే కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం జాతీయ రాజకీయాలపై దేవేగౌడతో  చర్చించనున్నారు. గతంలో కూడా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దేవేగౌడతో భేటీ అయ్యారు.  రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిని ఎవరిని బరిలోకి దింపాలనే విషయంతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.  ఇవాళ హైద్రాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. 

also read:తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: టీఆర్ఎస్ పై మోడీ పరోక్ష విమర్శలు

అయితే ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారంగే కేసీఆర్ ఇవాళ దేవేగౌడను కలిసేందుకు బెంగుళూరు వెళ్లారు. ప్రధాని మోడీ Hyderabad కు వస్తున్న తరుణంలో కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకుండా బెంగుళూరు వెళ్లడంపై BJP  నేతలు విమర్శలు చేస్తున్నారు. 

గత వారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో తెలంగాణ సీఎం భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చించారు. మరో వైపు రైతు ఆఉద్యమం సందర్భంగా మరణించిన రైతు కుటుంబాలతో పాటు గల్వాన్ లోయలో మరణించిన  సైనిక కుటుంబాలకు కూడా కేసీఆర్ ఆర్ధిక సహాయం అందించారు.
 

click me!