వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలను కోరారు. పరోక్షంగా టీఆర్ఎస్ పై మోడీ విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: Telanganaలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. TRS పై నరేంద్ర మోడీ పరోక్షంగా విమర్శలు చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ప్రస్తావించకుండా మోడీ విమర్శలు చేశారు.
గురువారం నాడు బేగంపేట ఎయిర్ పోర్టులో నిర్వహించిన BJP కార్యకర్తల సమావేశంలో Narendra Modi ప్రసంగించారు. తెలుగులో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కుటుంబ పాలన, కుటుంబ పార్టీలు దేశానికి చేటు అని మోడీ చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాాలన అంతా అవినీతిమయంగా మారిందన్నారు.తెలంగాణ భవిష్యత్తు కోసం తాము పోరాటం చేస్తున్నట్టుగా మోడీ చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తొందని మోడీ ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని మోడీ చెప్పారు.
undefined
తెలంగాణలో మార్పు తథ్యమన్నారు. ప్రజలు ఈ విషయమై ఇప్పటికే స్పష్టంగా నిర్ణయం తీసుకొన్నారని మోడీ తెలిపారు.గతంలో జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు ఈ విషయమై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. యువతతో కలిసి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని మోడీ చెప్పారు.
ప్రత్యేక తెలంాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది ప్రాణాలు అర్పించుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒక్క కుటుంబం కోసం తెలంగాణలో అమరులు కాలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాాలను మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇక్కడి రాజకీయాల వల్ల అవి పేదలకు దక్కడం లేదని మోడీ విమర్శించారు.పథకాాల్లో రాజకీయం చేస్తే పేదలు నష్టపోతారని మోడీ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రజల అభిమానమే తన బలమన్నారు. మీ ప్రేమే తన బలమన్నారు. మీ అభిమానం, అప్యాయతలకు కట్టుబడి ఉన్నానన్నారు. దేశ సమగ్రత మన చేతుల్లోనే ఉందన్నారు. బీజేపీకి చెందిన ఒక్కొక్క కార్యకర్త సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశయాల కోసం పోరాటం చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ గా మార్చాలనుకొంటే కొందరు కుటుంబ పాలనలో బంది చేయాలనుకుంటున్నారని మోడీ విమర్శించారు.
బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడుల విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దాడుల్లో మరణించిన బీజేపీ కార్యకర్తలకు శ్రద్దాంజలి ఘటిస్తున్నట్టుగా చెప్పారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మారుపేరని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
also read:హైద్రాబాద్‌కి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ: బేగంపేటలో ఘన స్వాగతం
21వ శతాబ్దంలోనూ కొందరు మూఢనమ్మకాలను పాటిస్తున్నారన్నారు. అలాంటి వాళ్లు తెలంగాణకు న్యాయం చేయలేరన్నారు. మూఢనమ్మకాలు ఉన్న వ్యక్తులు తెలంగాణను ముందుకు తీసుకెళ్లలేరని మోడీ విమర్శించారు. తమ పోరాటం పలితాన్ని ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గుజరాత్ లో ఒక ప్రాంతానికి వెళ్తే అధికారం పోతుందనే ప్రచారం ఉండేది., అయితే తాను పదే పదే ఆ ప్రాంతానికి వెళ్లేవాడినని మోడీ గుర్తు చేసుకున్నారు.మూడ నమ్మకాలు తెలంగాణ అభివృద్దికి అడ్డంకిగా మారాయని ఆయన చెప్పారు.