అలా అంటే సోనియా, రాహుల్‌ను అవమానించినట్టే: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మధుయాష్కి

Published : May 26, 2022, 01:12 PM ISTUpdated : May 26, 2022, 01:20 PM IST
అలా అంటే సోనియా, రాహుల్‌ను అవమానించినట్టే: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మధుయాష్కి

సారాంశం

రెడ్డి సామాజికవర్గంకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బయటి నుంచి కాకుంటే సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మధుయాష్కి స్పందించారు.   

రెడ్డి సామాజికవర్గంకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బయటి నుంచి కాకుంటే సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని మధుయాష్కి అన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై గందరగోళాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ వ్యాఖ్యల ద్వారా అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సూచించారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏర్పడ్డ గందరగోళాన్ని తొలగించాలని సూచించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్గా, జానారెడ్డి సీఎల్పీ నేతగా ఉండి కూడా తెలంగాణ పార్టీ ఓడిపోయిందని గుర్తుచేశారు. రెడ్ల వలనే పార్టీ నడుస్తుందనడం తప్పుడు అభిప్రాయం అని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వైఎస్ వల్లే యూపీఏ ప్రభుత్వం ఏర్పడిందని అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. 

వైఎస్, డీఎస్ నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 41 ఎంపీ సీట్లు గెలిచిందని గుర్తుచేశారు. సోనియా, రాహుల్ వల్లే ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీ సీట్లు గెలిచామని అన్నారు. వైఎస్ వల్లనే సీట్లు గెలిచామనడం సోనియా, రాహుల్‌ను అవమానించినట్టేనని అన్నారు. 

రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?
మీ పార్టీలు గెలవాలన్నా రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి పతనమయ్యాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రెడ్లకు అవకాశం ఇవ్వండి రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తానంటూ సవాల్ విసిరారు.ఈ నెల 22న  రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

also read:కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దుమారం: హై కమాండ్‌కి ఫిర్యాదు చేస్తానన్న వీహెచ్

రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు, నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారని.. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు, బలహీన వర్గాలకు దూరం అవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నామని  రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దని ఆయన సూచించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి పద్మనాయకులను దగ్గరికి తీశాడని రేవంత్ గుర్తుచేశారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి..వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. ఆనాటి నుండి.. ఈనాటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు కూడా తప్పు బట్టారు. కాకతీయ సామ్రాజ్యం పై అవగాహన లేకే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావులు విమర్శించారు. ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో కనీస సమాచారం లేకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !