పోరాడదాం.. ఆందోళన వద్దు, పార్టీ అండగా వుంటుంది : కవితకు కేసీఆర్ భరోసా

Siva Kodati |  
Published : Mar 08, 2023, 04:59 PM IST
పోరాడదాం.. ఆందోళన వద్దు, పార్టీ అండగా వుంటుంది : కవితకు కేసీఆర్ భరోసా

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా తన కుమార్తెకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు.   

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తన కుమార్తె కల్వకుంట్ల కవితకు తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం ఫోన్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆమెకు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. న్యాయపరంగా బీజేపీ అకృత్యాలపై పోరాడదామని సీఎం ధైర్యం చెప్పారు. నీ కార్యక్రమాలు కొనసాగించాలని.. ఆందోళనపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అండగా వుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. 

ఇదిలావుండగా.. కవిత బుధవారం తన నివాసం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తన నివాసం నుండి  ప్రగతి భన్ కు  వెళ్తారని భావించారు. కానీ  కవిత  ప్రగతి భవన్ కు వెళ్లకుండా శంషాబాద్  ఎయిర్ పోర్టుకు  బయలుదేరారు. నిర్ణీత షెడ్యూల్  మేరకు  ఇవాళ  సాయంత్రం  కవిత  ఢిల్లీకి వెళ్లాల్సి  ఉంది. అయితే ఈడీ నుండి  స్పందన  కోసం  ఇవాళ సాయంత్రం వరకు  కవిత ఎదురు చూశారు. కానీ  ఈడీ  నుండి  ఎలాంటి స్పందన రాలేదు. దీంతో  తన నిర్ణీత  షెడ్యూల్  మేరకు  కార్యక్రమాలను  కొనసాగించాలని  కవిత నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి  ధర్నాలో పాల్గొనేందుకు  వీలుగా , అక్కడి ఏర్పాట్లను సమీక్షించేందుకు కవిత  ఇవాళ  ఢిల్లీకి వెళ్లినట్టుగా  ఆమె సన్నిహితులు  చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్  లో  ప్రవేశ పెట్టాలని  కోరుతూ  ఈ నెల  10వ తేదీన  ఢిల్లీ  జంతర్ మంతర్ వద్ద  కవిత దీక్ష  నిర్వహించనున్నారు. ఈ దీక్షలో  పలు పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు.  

Also REad: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు : 9న ఢిల్లీకి రావాలని కవితకు ఈడి సమన్లు

కాగా... ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఈడీ మార్చి 9న విచారణకు హాజరుకావాలంటూ  బుధవారం సమన్లు ​​జారీ చేసింది. ఆమె సన్నిహితుడు అరుణ్ రామచంద్రన్ పిళ్లైని ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. తాను కవితకు బినామీని అని రామచంద్ర పిళ్లై చెప్పినట్లు ఈడి తెలిపింది. దీంతో ఢిల్లీలో విచారణకు రావాలని ఈడి చెప్పింది. నిన్న అరెస్ట్ చేసిన రామచంద్ర పిళ్లైను ఈడి దాదాపు 80సార్లు ప్రశ్నించింది. 

ఇక రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. అరుణ్ రామచంద్రపిళ్లై కవిత బినామీ అని ఆరోపించిన ఈడీ.. ఆమె చెప్పినట్లు పిళ్లై నడుచుకున్నాడని పేర్కొంది. తాను కవిత ప్రతినిధినని అరుణ్ అనేకమార్లు స్టేట్‌మెంట్ ఇచ్చాడని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ స్థాపనలో పిళ్లై కీలకపాత్ర పోషించాడని.. అలాగే కాగితాలపై 3.5 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు చూపారని ఈడీ పేర్కొంది. మొదటి నుంచి అరుణ్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ గురించి అరుణ్ రామచంద్రపిళ్లై, కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ముందే తెలుసునని ఈడీ పేర్కొంది. అలాగే సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించినట్లు పిళ్లై విచారణలో చెప్పాడని ఈడీ తెలిపింది. ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్‌లో ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ తమకు దొరికిందని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాంలో హవాలా కోణానికి సంబంధించి పిళ్లైని ప్రశ్నించాలని ఈడీ తన రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు