తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ఢిల్లీ బయలుదేరారు. వారం రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ నుండి పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆర్ధిక, మీడియా, రాజకీయ ప్రముఖులతో భేటీ కానున్నారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR శుక్రవారం నాడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానశ్రయం నుండి ఆయన Delhi కి వెళ్లారు. కేసీఆర్ వెంట పలువురు TRS నేతలున్నారు. వారం రోజుల పాటు కేసీఆర్ Delhiలోనే ఉంటారు. పలు రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. రాజకీయ, ఆర్ధిక, మీడియా ప్రముఖులతో కేసీఆర్ భేటీ కానున్నారు.
ఈ నెల 22న Punjab రాష్ట్రంలో కేసీఆర్ పర్యటించనున్నారు. రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శిస్తారు. 600 రైతు కుటుంబాలకు కేసీఆర్ ఆర్ధిక సహాయం అందిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం చెల్లించనున్నారు కేసీఆర్.
undefined
ఈ నెల 26న ఉదయం సీఎం కేసీఆర్ Bangloreకు వెళ్తారు మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కానున్నారు. దేశ రాజకీయాలపై దేవేగౌడతో కేసీఆర్ చర్చించనున్నారు.ఈ నెల 27న రాలేగావ్ సిద్ది ప్రాంతానికి కేసీఆర్ వెళ్తారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారావేతో సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు. అక్కడి నుండి షీర్డీ సాయిబాబా దర్శనం కోసం వెళ్తారు. షీర్డీ నుండి కేసీఆర్ హైద్రాబాద్ కు తిరిగి వస్తారు. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో కేసీఆర్ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించే అవకాశం ఉంది. గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను కూడా కేసీఆర్ పరామర్శించనున్నారు.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కొంత కాలంగా ఫోకస్ పెడుతున్నారు. ఈ మేరకు అవకాశం దొరికనప్పుడల్లా బీజేపీపై కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఏ రకమైన పరిస్థితులు నెలకొన్నాయనే విషయాలను కూడా మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే దేశం మెనక్కి వెళ్తోందని కూడా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నకల నాటికి దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటు కానుందనే ఆకాంక్షను కూడా కేసీఆర్ వ్యక్ం చేస్తున్నారు. అయితే దీనికి తెలంగాణ రాష్ట్రమే వేదికగా మారే అవకాశం ఉందని కూడా ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
also read:CM KCR: సీఎం కేసీఆర్ నేషనల్ టూర్.. పలువురు జాతీయ నేతలతో భేటీ!
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకుండా ప్రత్యామ్నాయ విధానాలతో పార్టీ లేదా ప్రత్యామ్నాయ సంస్థ ఏర్పాటు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయని కూడా కేసీఆర్ ప్రకటించారు. అయితే కేసీఆర్ వారం రోజుల పర్యటన ఇందులో భాగమేననే అభిప్రాయాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో విన్పిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పేందుకు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ తో కూడా కేసీఆర్ చర్చించారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి
మరో వైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ ఎద్దేవా చేస్తుంది. కేసీఆర్ కి జాతీయ రాజకీయాల్లో టెంట్ లేదు ఫ్రంట్ లేదని తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.