తెలంగాణలో పోలీసు శాఖలో ఉద్యోగాలకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్: Telangana లో పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు నిర్ణయం తీసుకొంది. వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొంది. దీంతో రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ కేసీఆర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే యూనిఫాం ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల పాటు వయో పరిమితిని పెంచింది. అయితే పోలీస్ ఉద్యోగాల కోసం వయో పరిమితిని పెంచాలనే డిమాండ్ నెలకొనడంతో మరో రెండేళ్ల పాటు వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం ఐదేళ్లపాటు వయో పరిమితిని పెంచినట్టైంది.
undefined
తెలంగాణలో Police శాఖలో ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకున్నవారి నుండి Age పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సిఎం KCR సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, DGP ని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ్టితో గడువు ముగియనుంది.తెలంగాణలో 17,291 ఉద్యోగాల భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల రెండో తేది నుండి ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం వరకు 10 లక్షల మంది అభ్యర్ధులు ధరఖాస్తులు చేసుకొన్నారని సమాచారం.తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
తెలంగాణలో 15,644 పోలీస్ కానిస్టేబుళ్లు, 554 ఎస్ఐ ఉద్యోగాల కోసం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నియామాకాలు జరగనున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలు, పిజికల్ టెస్ట్, ఫిజికల్ సామర్ధ్యం టెస్ట్ ల తర్వాత చివరగా మరో పరీక్షను నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్ధులే తర్వాత లెవల్ కి ఎంపికకానున్నారు.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం వయో పరిమితిని పెంచాలని కోరుతూ అభ్యర్ధుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. డీజీపీ కార్యాలయం ముందు అభ్యర్ధులు ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ ఇవాళ నిర్ణయం తీసుకొంది.
also read:తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ ... వయో పరిమితి పెంచండి : డీజీపీ ఆఫీస్‌ని ముట్టడించిన అభ్యర్ధులు
ఇదిలా ఉంటే పోలీసు ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పోలీస్ శాఖ ఈ దఫా కొత్తగా అమల్లోకి తీసుకొచ్చింది.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ లో ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసే సమయంలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసినట్టుగానే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక వివరాలతో TSLPRB వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ లేదా ధరఖాస్తు చేసుకొనే సమయంలో అభ్యర్ధులు నమోదు చేసిన డేటాను సవరించుకొనే వీలు లేదు. ఒక్కసారి ధరఖాస్తు లేదా రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయంలో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఈ సమాచారాన్ని అప్ డేట్ చేసే వీలు లేదు. తప్పుడు వివరాలు నమోదు చేస్తే సంబంధిత అభ్యర్ధి ధరఖాస్తును తిరస్కరిస్తారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం పోటీపడే ఇతర రాష్ట్రాల అభ్యర్ధులకు కూడా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ సామాజికవర్గానికి చెందిన వారైనా సరే ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులను OC లుగానే పరిగణించనున్నారు.ఇతర రాష్ట్రాల అభ్యర్ధులకు 5 శాతం Reservation మాత్రమే వర్తించనుంది.
ఈ నెల 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తొలి రోజే 15 వేల మంది ధరఖాస్తు చేసుకొన్నారు. 2018లో పోలీస్ ఉద్యోగాల కోసం ఆరు లక్షల మంది ధరఖాస్తు చేసుకొన్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఐ నుండి కానిస్టేబుల్ తో పాటు ఏఆర్, సివిల్ తదితర విభాగాల్లో ధరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే ఫోన్ నెంబర్ తో ఈ ధరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది.