పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లి: హాజరైన కేసీఆర్, జగన్

By narsimha lodeFirst Published Nov 21, 2021, 1:33 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి పెళ్లి సందర్భంగా  తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ లు హాజరయ్యారు. ఆదివారం నాడు ఉదయం శంషాబాద్ సమీపంలోని ఫంక్షన్ లో ఈ పెళ్లి జరిగింది. 


 హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనమరాలి వివాహనికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ లు హాజరయ్యారు. శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌హాల్ లో జరిగిన వివాహానికి రెండు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తొలుత ఇద్దరు సీఎంలు పక్కపక్కనే కూర్చుకొన్నారు. వారి పక్కనే కొద్దిసేపు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూర్చొన్నారు.kcr, ys jagan కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత నూతన వధూవరులను ఇద్దరు సీఎంలు ఆశీర్వదించారు.  ఈ సందర్భంగా స్పీకర్ Pocharam srinivas reddy కుటుంబ సభ్యులు ఇద్దరు సీఎంలతో కలిసి ఫోటోలు దిగారు. 

 చాలా కాలం తర్వాత ఇద్దరు కలుసుకొన్న ఇద్దరు సీఎంలు

ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య చోటు చేసుకొన్న సమస్యలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల సీఎంలు కలుసుకొన్నారు. హైద్రాబాద్ లోని ప్రగతి భవన్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు మంత్రులు, ఆ పార్టీ నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత విజయవాడకు వెళ్లిన మసయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. 

ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య  జల జగడం చోటు చేసుకొంది. రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి.  ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ పై రెండు రాష్ట్రాలకు చెందిన నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొన్నారు.  ఏపీ సీఎం జగన్ నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై  తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.అంతే స్థాయిలో ఏపీ మంత్రులు కూడా కేసీఆర్ పై తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

also read:700 మంది చనిపోయారు, రైతులకు సారీ చెబితే చాలా.... రేపు ఢిల్లీలో తాడోపేడో : కేసీఆర్

రాయలసీలమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం వేగంగా నిర్మిస్తోందిరాయలసీలమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం వేగంగా నిర్మిస్తోంది.అయితే ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తమ రాష్ట్రం ఏడారిగా మారే అవకాశం ఉందని తెలంగాణ చెబుతుంది,. తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టులపై కూడా ఏపీ రాష్ట్రం అభ్యంతరం చెబుతుంది.రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది,. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను ఇవ్వడంపై తెలంగాణ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ నివేదిక ఆధారంగానే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయమై నిర్ణయం తీసుకోనుంది.

గోదావరి నదిపై పెద్దవాగును జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కేఆర్ఎంబీ పరిధిలోకి తమ రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను తెస్తూ  ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఇస్తూ జీవో జారీ చేసిన తర్వాతే ఈ ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం మెలిక పెట్టింది.
 

click me!