దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన.. డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ బహిరంగ సభ

Siva Kodati |  
Published : Oct 02, 2022, 04:00 PM ISTUpdated : Oct 02, 2022, 04:23 PM IST
దసరా రోజున కొత్త పార్టీ ప్రకటన.. డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ బహిరంగ సభ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించి.. అదే రోజున కొత్త జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు సీఎం.   

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించి.. అదే రోజున కొత్త జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు సీఎం. భారత రాష్ట్ర సమితి పేరునే కేసీఆర్ ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ALso Read:జాతీయ పార్టీ ఏర్పాటు: ప్రగతి భవన్ లో మంత్రులు,జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ భేటీ

అంతకుముందు టీఆర్ఎస్ జల్లా అధ్యక్షులు, మంత్రులతో కేసీఆర్ ఆదివారం నాడు ప్రగతి భవన్ లో  సమావేశమయ్యారు. ఈ నెల 5వ తేదీన జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత నెలకొంది. జాతీయపార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ కార్యాచారణను సిద్దం చేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  జాతీయ పార్టీ జెండా, ఎజెండాపై కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది.. అలాగే జాతీయ పార్టీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులపై పార్టీ నేతలకు ఆయన వివరించనున్నారు. ఈ నెల 5వ తేదీన  జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ఈనెల 6వ తేదీన ఢిల్లీకి టీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్లనుంది. వీరు జాతీయపార్టీ ఏర్పాటుకు సంబంధించి  రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. అనంతరం మహరాష్ట్ర నుండి దేశవ్యాప్త పర్యటనను ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?