రంగారెడ్డి జిల్లా యాచారంలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

Published : Oct 02, 2022, 03:17 PM ISTUpdated : Oct 02, 2022, 04:22 PM IST
రంగారెడ్డి జిల్లా యాచారంలో విషాదం..  చెరువులో ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు మృతి

సారాంశం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతిచెందారు. 

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. చిన్నారులంతా 15 ఏళ్లలోపేవారని తెలుస్తోంది. మృతులను సుమరీన్, ఖలీద్, ఇమ్రాన్, రెహానగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

దసరా సెలవులు కావడంతో పిల్లలు సరదగా ఈతకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి నలుగురు పిల్లలు చనిపోవడంతో వారి కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరుగా  విలపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు