అంతా కేంద్రం వల్లే.. ఒక్క చుక్కను వదలం: అపెక్స్ కమిటీ భేటీపై కేసీఆర్ అసహనం

By Siva KodatiFirst Published Jul 30, 2020, 9:25 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. నీటి వాటాల పంపిణీలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ప్రధానంగా కేంద్ర జలవనరుల శాఖ పనితీరు హాస్యాప్పదమన్నారు

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. నీటి వాటాల పంపిణీలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ప్రధానంగా కేంద్ర జలవనరుల శాఖ పనితీరు హాస్యాప్పదమన్నారు.

జల వివాదాల పరిష్కార బాధ్యతలు ట్రిబ్యునల్‌కు అప్పగించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... 5న అపెక్స్ కమిటీ సమావేశం సరైంది కాదని సీఎం అన్నారు.

ఆ తేదీల్లో ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు. ఆగస్టు 15 వేడుకలు కూడా దగ్గరలో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. 20 తర్వాత సమావేశం ఉండేలా కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాస్తామని సీఎం తెలిపారు.

Also Read:అందరి చూపు అపెక్స్ కౌన్సిల్‌ మీటింగ్‌పైనే: పోతిరెడ్డిపాడుపై తగ్గని జగన్, కేసీఆర్ ఏం చేస్తారు?

కేంద్రం దుర్మార్గ వైఖరిని వీడాలని , కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల తెలుగు రాష్ట్రాలు మూల్యం చెల్లించుకుంటున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య కేసులు, ఘర్షణ వాతావరణం మంచిదికాదని సీఎం సూచించారు.

పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు పూర్తి చేసి తీరతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి జలాల్లో నీటి వాటాను కాపాడుకొని తీరుతామని, ఒక్క చుక్క నీటిని కూడా వదిలే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. తాము ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు. 

click me!