కరోనా వచ్చిన తర్వాత దేశంలో సామాజిక పరిస్థితులు దారుణంగా పడిపోతున్నాయి. తోటి మనిషి దగ్గినా, తుమ్మినా అవమానకరంగా చూసే పరిస్ధితులు దాపురించాయి
కరోనా వచ్చిన తర్వాత దేశంలో సామాజిక పరిస్థితులు దారుణంగా పడిపోతున్నాయి. తోటి మనిషి దగ్గినా, తుమ్మినా అవమానకరంగా చూసే పరిస్ధితులు దాపురించాయి. ప్రజల్లోనే ఈ తీరు ఉందనే బాధ ఒకవైపు వుండగానే.. ప్రభుత్వాధికారులు సైతం అలాగే వ్యవహరిస్తున్నారు.
కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాల కాల్చివేతలో నిబంధనలు, సంప్రదాయాలను అధికారులు గాలికొదిలేశారు. వాళ్లను చేత్తో సైతం తాకకుండా జేసీబీలతో తరలించిన ఘటనలు చూశాం. తాజాగా వరంగల్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఒకే చితిపై నాలుగు మృతదేహాలను ఖననం చేశారు.
undefined
మూడు చితుల్లో 9 మృతదేహాలకు పైనే కాల్చివేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న కరోనా మృతుల సంఖ్యకు.. కాలుతున్న చితి మంటలకు పొంతన ఏ మాత్రం కుదరడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాదులో కరోనా వైరస్ కట్టడి కావడం లేదని ఎప్పటికప్పుడు రికార్డవుతున్న కేసుల సంఖ్య తెలియజేస్తోంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60717కు చేరుకుంది.
కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కోవిడ్ -19 వ్యాధి వల్ల 13 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 505కు చేరుకుంది. హైదరాబాదులో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. గత 24 గంటల్లో హైదరాబాదులో 521 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.