పెట్రోల్, డీజిల్ (petrol diesel price) ధరలపై మేం నయా పైసా పెంచలేదని.. అందువల్ల రేట్లు తగ్గించేది లేదన్నారు తెలంగాణ సీఎం (telangana cm) కేసీఆర్ (kcr) . వ్యాట్ (vat) పెంచలేదు కాబట్టి మేం పెట్రోల్ రేట్లు తగ్గించమన్నారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్ తీసేయాలని తాము ఆయన డిమాండ్ చేశారు.
పెట్రోల్, డీజిల్ (petrol diesel price) ధరలపై మేం నయా పైసా పెంచలేదని.. అందువల్ల రేట్లు తగ్గించేది లేదన్నారు తెలంగాణ సీఎం (telangana cm) కేసీఆర్ (kcr) . ఆదివారం ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యాట్ (vat) పెంచలేదు కాబట్టి మేం పెట్రోల్ రేట్లు తగ్గించమన్నారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్ తీసేయాలని తాము ఆయన డిమాండ్ చేశారు. సెస్ తొలగించడానికి ఎవరెవరిని కలుపుకోవాలని వారిని కలుపుకుపోతామని కేసీఆర్ తెలిపారు.
ఎన్నికలు అన్నాకా గెలుస్తామం.. ఓడతామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హుజుర్‌నగర్‌లో (huzurnagar bypoll) తాము గెలవలేదా ఆయన గుర్తుచేశారు. పార్టీ అన్నాక గెలుపోటములు సహజమన్నారు. ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఉపఎన్నికలో గెలిస్తే భూమి బద్దలవుతుందా అని మండిపడ్డారు. రైతులతో చెలగాటం ఆడుతున్నారు కాబట్టే ఇంతగా మాట్లాడుతన్నా అని సీఎం అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసులు పెడతామని.. రోడ్ల మీద నిలబెడతామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎరువులు, పప్పులు అన్ని ధరల్ని పెంచారని.. ఇన్నాళ్లూ క్షమించామని, ఇక క్షమించమని ఆయన హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) కూడా అబద్ధాలు చెబుతున్నారని.. రైతులు, దళితులు బీసీల్లో కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఉద్దరించిందని ఆయన ప్రశ్నించారు.
undefined
రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ పంటను అమ్ముకోగలరా .. కార్పోరేట్లకు అనుకూలంగా చేసే కుట్ర అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీలో ధర్నా చేస్తామని.. పంజాబ్‌లో ధాన్యం మొత్తం కొని, తెలంగాణలో ఎందుకు సేకరించరని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికో నీతి ఉంటుందా.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పాలసీ ఉంటుందా అని కేసీఆర్ నిలదీశారు. ఢిల్లీలో చేసే ధర్నాలో తాను కూడా పాల్గొంటానని... ధాన్యాన్ని కొనేవరకు వదిలిపెట్టమని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చే నీటి వాటా ఎంతో కేంద్రమంత్రి తేల్చాలని .. దమ్ముంటే కొత్త ట్రైబ్యునల్ వేయాలని కేసీఆర్ సవాల్ విసిరారు. కేఆర్ఎంబీ (krmb), జీఆర్ఎంబీ (grmb), దొంగడ్రామా ఏముంది దానిలో అని ఆయన ప్రశ్నించారు. డైరెక్ట్‌గా తానే రంగంలోకి దిగానని కేసీఆర్ స్పష్టం చేశారు.
ALso Read:కళ్లు నెత్తికెక్కాయా, టచ్ చేసి చూడు.. బిడ్డా బతుకుతావా: బండి సంజయ్‌కి కేసీఆర్ వార్నింగ్
దమ్ముంటే ప్రాజెక్ట్‌ల్లో అవినీతిని బయటపెట్టాలని.. రైతులను ముంచి రాజకీయం చేయాలని చూస్తున్నాని, ఈ కుటిల నీతిని రైతులు గమనించాలని సీఎం సూచించారు. ఏడేళ్లు పోరాడితేగానీ రాష్ట్రానికి హైకోర్టు (telangana high court) ఇవ్వలేదని.. మీరు సహకరించకున్నా, మేం సహకరించామని ప్రధానికి చెప్పానని కేసీఆర్ గుర్తుచేశారు. అసలు ఎవరీ బండి సంజయ్ రాష్ట్రానికి ఏమైనా తెచ్చాడా..? హుజురాబాద్లో (huzurabad bypoll) గెలిచినంత మాత్రాన విర్రవీగుతున్నారని.. సాగర్‌లో (nagarjuna sagar bypoll) డిపాజిట్ రాలేదని సీఎం దుయ్యబట్టారు.
ఉపఎన్నికల్లో బీజేపీ 30 సీట్లు పొగొట్టుకుందని.. 2018 ఎన్నికల్లో 107 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వున్నాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. సరిహద్దుల్లో చైనా (indo china border) ముందు తోకముడిచారని.. మన సరిహద్దుల్లో చైనా వాడు ఊర్లకు ఉర్లే కడుతున్నాడని, గంగా నదిలో కోవిడ్ సమయంలో శవాలు తేలాయని సీఎం దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం రైతుల మీద భయంకరమైన కుట్ర పన్నుతోందని .. మీ చేతగాని తనం వల్ల దేశాన్ని నాశనం చేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం పెంచిన పెట్రోల్ ధరల వల్ల అన్ని ధరలు పెరిగాయని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.
Also Read:కేంద్రం మెలిక.. విధిలోని స్ధితిలోనే యాసంగిలో వరి వద్దన్నాం: కేసీఆర్ క్లారిటీ
ఒక్కొక్కరికి 15 లక్షలు ఇచ్చారా.. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని కేసీఆర్ ప్రశ్నించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఓట్లు దండుకోవడమే పనా..? దేశ జీడీపీని సర్వనాశనం చేశారని కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది కేవలం రూ.42 వేలు కోట్లేనన్నారు. ఎల్ఐసీ లాంటి సంస్థని నిర్వీర్యం చేశారని.. ప్రతి బావి దగ్గరా కరెంట్ మీటర్ పెట్టాలంటున్నారని, తానే అడ్డుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథను (mission bhagiratha) నీతి ఆయోగ్ (niti aayog) ప్రశంసించింది కానీ నయా పైసా ఇవ్వలేదని .. అడుగడుగునా మిమ్మల్ని తరిమికొడతామని, తమకు చేతగాక కాదని కేసీఆర్ హెచ్చరించారు. కేంద్ర మంత్రి తమ పాలసీ ఏంటో ప్రకటించాలని సీఎం డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్ (crude oil price) ధర 105 డాలర్లు దాటలేదని.. పెరగని అంతర్జాతీయ ధరల్ని పెరిగాయని బీజేపీ ప్రజల్ని మోసం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం రూ.77కే పెట్రోల్‌ను ఇవ్వొచ్చని సీఎం తెలిపారు.