విద్యుత్ ఉత్పత్తి ఆగదు.. ప్రాజెక్ట్‌ల వద్దకు ఎవరినీ అనుమతించొద్దు: అధికారులకు కేసీఆర్ హుకుం

By Siva KodatiFirst Published Jul 3, 2021, 9:59 PM IST
Highlights

ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌ను గుర్తించడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ స్టే వున్నా నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తివేసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అక్రమమేనని కేసీఆర్ అన్నారు.

ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌ను గుర్తించడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పర్యావరణ అనుమతులు, ఎన్జీటీ స్టే వున్నా నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కాల్వకు నీటిని ఎత్తివేసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అక్రమమేనని కేసీఆర్ అన్నారు. జూలై 9న నిర్వహించబోయే కృష్ణా బోర్డు త్రిసభ్య సమావేశం రద్దు చేయాలని తెలంగాణ సీఎం కోరారు. జూలై 20 తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను ఎజెండాలో చేర్చాలని సీఎం కోరారు.

కృష్ణాబోర్డ్ సమావేశంలో తమ వాదనను వినిపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కృష్ణా బోర్డుకు లేదని సీఎం తేల్చిచెప్పారు. జల విద్యుత్‌కు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాలను సముద్రంలోకి వృథా చేస్తున్నారనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు.

Also Read:కృష్ణాజలాల ఎత్తిపోతల పథకం పనుల్లో మరో ముందడుగు.. ఆదివారం భూమిపూజ..

జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతుల ప్రాజెక్ట్‌లో నీటి లభ్యత ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటినే శ్రీశైలం ప్రాజెక్ట్‌లో వాడుకుంటామని.. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలని ఏపీ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదమన్నారు. శ్రీశైలం డ్యామ్ వద్దకు గుర్తింపు కార్డులున్న ఉద్యోగులను తప్ప ఎవరిని అనుమతించొద్దని కేసీఆర్ పోలీసులను ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. 

click me!