తెలంగాణ: కొత్తగా 848 మందికి పాజిటివ్... జీహెచ్‌ఎంసీలో తొలిసారిగా 100 లోపే కేసులు

Siva Kodati |  
Published : Jul 03, 2021, 09:11 PM IST
తెలంగాణ: కొత్తగా 848 మందికి పాజిటివ్... జీహెచ్‌ఎంసీలో తొలిసారిగా 100 లోపే కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా దూకుడు బాగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 848 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి నిదానించింది. అదే సమయంలో వైరస్ నుంచి 1,114 మంది కోలుకోగా, ఆరుగురు మరణించారు

తెలంగాణలో కరోనా దూకుడు బాగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 848 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి నిదానించింది. అదే సమయంలో వైరస్ నుంచి 1,114 మంది కోలుకోగా, ఆరుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,26,085 మంది కరోనా బారినపడ్డారు. అలాగే 6,09,947 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,454 యాక్టీవ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వల్ల 3,684 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 98 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీలో ఇదే కనిష్ఠం.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 33, జీహెచ్ఎంసీ 98, జగిత్యాల 17, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 17, గద్వాల 4, కామారెడ్డి 4, కరీంనగర్ 46, ఖమ్మం 48, ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 16, మహబూబాబాద్ 31, మంచిర్యాల 49, మెదక్ 6, మేడ్చల్ మల్కాజిగిరి 45, ములుగు 25, నాగర్ కర్నూల్ 10, నల్గగొండ 66, నారాయణపేట 6, నిర్మల్ 4, నిజామాబాద్ 12, పెద్దపల్లి 44, సిరిసిల్ల 26, రంగారెడ్డి 42, సిద్దిపేట 21, సంగారెడ్డి 11, సూర్యాపేట 58, వికారాబాద్ 5, వనపర్తి 13, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 44, యాదాద్రి భువనగిరిలో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు