టిమ్స్ ఆసుపత్రి: కరోనా డెడ్‌బాడీలపై బంగారం చోరీ, గుట్టుగా విక్రయం.. అడ్డంగా బుక్కైన దంపతులు

Siva Kodati |  
Published : Jul 09, 2021, 05:40 PM ISTUpdated : Jul 09, 2021, 05:41 PM IST
టిమ్స్ ఆసుపత్రి: కరోనా డెడ్‌బాడీలపై బంగారం చోరీ, గుట్టుగా విక్రయం.. అడ్డంగా బుక్కైన దంపతులు

సారాంశం

టిమ్స్ ఆసుపత్రిలో కరోనా మృతదేహాలపై వున్న బంగారాన్ని మాయం చేస్తూ వాటిని దొడ్డిదారిలో విక్రయిస్తున్న ఇద్దరు దంపతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకున్నారు.  

హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రిలో కరోనా మృతదేహాలే టార్గెట్‌గా దోపిడికి పాల్పడ్డారు దంపతులు. గత కొన్ని రోజులుగా కరోనా డెడ్ బాడీలపై వున్న నగల్ని మాయం చేసి అమ్ముకుంటున్నారు. ఇలా దాదాపు ఏడు మృతదేహాలకు చెందిన నగల్ని కొట్టేశారు. ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిగా విధుల్ని నిర్వహిస్తున్న చింతపల్లి రాజు, లతాశ్రీ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. దోచుకున్న నగల్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగల మాయంపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఆసుపత్రిలోని స్విపింగ్ సిబ్బందిని ప్రశ్నించగా వీరి బండారం బయటపడింది. 

PREV
click me!

Recommended Stories

Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్