Hyderabad Metro Rail: మెట్రో ఫేజ్ 2  రూట్స్ ఖరారు.. ప్రతిపాదించిన మెట్రో మార్గాలివే..  

By Rajesh Karampoori  |  First Published Jan 22, 2024, 10:51 PM IST

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ కోసం కొత్త రూట్‌లు ఖరారయ్యాయి. మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం తన ముందు ఉంచిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.


Hyderabad Metro Rail: హైదరాబాద్ వాసులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మార్గాన్ని ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. మొత్తం 70 కిలో మీటర్ల మేర రెండో దశ మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు చేయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 వ ఫేజ్ ను 4 కారిడార్లుగా నిర్మించనున్నారు. అలాగే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మార్గాన్ని పొడిగించనున్నారు.

ప్రతిపాదించిన మెట్రో మార్గాలివే..

Latest Videos

కారిడార్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు (5.5 కిలో మీటర్లు), అలాగే.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు (1.5 కిలో మీటర్లు). 

కారిడార్-4లో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. అలాగే..  నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కిలో మీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఈ మార్గంతో నాగోల్ - ఎల్బీనగర్ - చాంద్రాయణగుట్ట - మైలార్‌దేవ్‌పల్లి  లను కలుపనున్నారు. మరోవైపు.. కారిడార్-4లో భాగంగా ఆరామ్‌ఘర్ మీదుగా మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలో మీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు.

కారిడార్-5 కింద రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు (8 కిలో మీటర్లు). ఈ మార్గం రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామ్‌గూడ జంక్షన్, విప్రో జంక్షన్ , US కాన్సులేట్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) వరకు  ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. 

కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి పటాన్‌చెరు వరకు BHEL (14 కి.మీ)

కారిడార్ 7: ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్ నుండి వనస్థలిపురం, హయత్‌నగర్ (8 కి.మీ)

ప్రతిపాదిత ఈ నూతన మెట్రో రైలు మార్గాల్లో  హైదరాబాద్ నగరంలోని మెజారిటీ ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, అవాంతరాలు లేని రవాణా సౌకర్యానికి ప్రాప్యతను నిర్ధారించడానికి నగరం నాలుగు మూలల నుండి విమానాశ్రయాన్ని కలుపుతాయి.

click me!