ఎన్నికలకు ముందు ఛార్జీలు పెంచుతామని చెప్పలేదే: కేసీఆర్‌పై భట్టి ప్రశ్నలు

By Siva KodatiFirst Published Mar 16, 2020, 6:48 PM IST
Highlights

అప్పులు తీర్చాలంటే, సామాన్యులపై మళ్లీ భారం వేస్తారని.. మద్యం, కరెంట్ ఛార్జీలు పెంచి భారం వేస్తున్నారని భట్టి దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ఛార్జీలు పెంచుతామని ఎందుకు చెప్పలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

అప్పులు తీర్చాలంటే, సామాన్యులపై మళ్లీ భారం వేస్తారని.. మద్యం, కరెంట్ ఛార్జీలు పెంచి భారం వేస్తున్నారని భట్టి దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ఛార్జీలు పెంచుతామని ఎందుకు చెప్పలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, డీపీఆర్‌లు ఇవ్వాలంటే 10 లారీలు అవసరమా అని విక్రమార్క నిలదీశారు. బడ్జెట్ సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందుగానే ముగించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎల్పీ నేత .

Also Read:మందుబాబులపై బాంబు.. త్వరలో రేట్లు పెంచుతామన్న కేసీఆర్

బడ్జెట్‌ వాస్తవానికి దగ్గరగా లేదని అప్పుల కోసం ఆదాయాన్ని పెంచి చూపించారని భట్టి మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీలో రాజకీయ ఉపన్యాసం చెప్పి, ప్రజలను భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏమాత్రం ఆలోచించించడం లేదని అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్ధితికి తెచ్చారని విక్రమార్క ఆరోపించారు. అప్పులు కట్టడానికి అప్పులు తెచ్చే పరిస్ధితి ఉందని, డెత్ ట్రాప్‌లోకి రాష్ట్రాన్ని నెట్టేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

అంతకుముందు 2020-21 ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించడంతో శాసనసభ సమావేశాలు ముగిశాయి. మొత్తం 48 గంటల 41 నిమిషాల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి.

Also Read:కేంద్రంపై తెలంగాణ ఆధారపడలేదు.. మన భిక్షపైనే కేంద్రం ఆధారపడింది: అసెంబ్లీలో కేసీఆర్

ఈ సమయంలో 6 బిల్లులు, రెండు తీర్మానాలు, రెండు స్వల్ప చర్చలు సభలో నిర్వహించారు. వీటిలో ప్రధానంగా సీఏఏ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపుపై అసెంబ్లీ తీర్మానం చేయగా.. కరోనా, పల్లెప్రగతి అంశాలపై స్వల్పకాల చర్చ చేపట్టారు. 

click me!