కేసీఆర్ కాలం చెల్లిన ఔషదం: రేవంత్ రెడ్డి సెటైర్లు

By narsimha lodeFirst Published Feb 8, 2024, 5:09 PM IST
Highlights


భారత రాష్ట్రసమితిపై  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.  

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్  జడ్జిని కేటాయించలేమని హైకోర్టు నుండి సమాచారం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  చెప్పారు.గురువారంనాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత  అసెంబ్లీలోని తన చాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. జడ్జిల కొరత ఉన్నందున  సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు తెలిపిందన్నారు. రిటైర్డ్ జడ్జితో విచారణ విషయమై  కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చించనున్నట్టుగా ఆయన తెలిపారు.

మేడిగడ్డపై చర్చను పక్కదారి పట్టించేందుకు  కేఆర్ఎంబీ అంశాన్ని కేసీఆర్ తెరమీదికి తీసుకు వచ్చారని  రేవంత్ రెడ్డి విమర్శించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులకు గత ప్రభుత్వమే కేటాయించిందని రేవంత్ రెడ్డి చెప్పారు.నాగార్జున సాగర్ ను ఏపీ పోలీసులు ఆక్రమిస్తే  కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని ఆయన  అడిగారు. 

 కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్దిని ప్రజలు చూశారన్నారు.అందుకే కృష్ణా బేసిన్ ప్రాంతంలో  బీఆర్ఎస్ ఓటమి పాలైందని ఆయన ఎద్దేవా చేశారు.కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని  రేవంత్ రెడ్డి చెప్పారు.

also read:బస్సులో అసెంబ్లీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

అసెంబ్లీలో బీఆర్ఎస్ కు  చాంబర్ ఇవ్వాలని కోరారు. వారికి చాంబర్ కేటాయించారు. ఎక్కడ చాంబర్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వవద్దు అనేది తమ పరిధిలోని అంశం కాదు.. ఇది స్పీకర్ పరిధిలోని అంశంగా ఆయన పేర్కొన్నారు. బీఏసీ సమావేశానికి  బీఆర్ఎస్ తరపున  కేసీఆర్, కడియం శ్రీహరి హాజరౌతారని  సమాచారం పంపారన్నారు. అయితే  కేసీఆర్ అందుబాటులో లేనందున  హరీష్ రావు  రావు బీఎసీ సమావేశానికి ఎలా హాజరౌతారో చెప్పాలన్నారు. అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ హాజరు కాకపోతే  హిమాన్షు పంపుతారా అని ఆయన  సెటైర్లు వేశారు.కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా  పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమ రతనాల సీమ అంటూ  వ్యాఖ్యల గురించి ఆయన గుర్తు చేశారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 

also read:ఫ్లైట్‌లోనే టిష్యూ పేపర్‌పై రైల్వే మంత్రికి వ్యాపారవేత్త ప్రతిపాదన: చర్చించిన రైల్వే అధికారులు

శ్రీశైలం ప్రాజెక్టు నుండి  ప్రతి రోజూ 12 టీఎంసీలు రాయలసీమకు తరలించేందుకు  కేసీఆర్ సర్కార్ సహకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.గవర్నర్ ప్రసంగం  ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్. గవర్నర్ ప్రసంగ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాకపోతే  ప్రభుత్వ విధానాలు ఎలా తెలుస్తాయని ఆయన  ప్రశ్నించారు.గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే  కేసీఆర్ బాధ్యత అర్ధం అవుతుందన్నారు. విపక్షనేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని కోరుకుంటున్నట్టుగా  చెప్పారు. 

మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించినట్టుగా తెలిపారు.  ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామన్నారు. విధానపర లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

click me!