Lok Sabha: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేల్లో సంచలన విషయాలు

By Mahesh K  |  First Published Feb 8, 2024, 4:46 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగిస్తుందా? లేదా? అనే విషయంపై టైమ్స్ నౌ సర్వే తన అంచనాలను వెల్లడించింది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లల్లో 9 సీట్లు కాంగ్రెస్, 2 సీట్లు బీఆర్ఎస్, ఐదు సీట్లు బీజేపీ, ఎంఐఎం ఒక్క సీటు గెలుచుకుంటుందని అంచనా వేసింది.
 


Lok Sabha Polls: లోక్ సభ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. తెలంగాణలో ఈ ఎన్నికల కోసం కసరత్తు ఫుల్ స్పీడ్‌గా జరుగుతున్నది. అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సరైన అభ్యర్థుల ఎంపికపై మేధోమథనం జరుగుతున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. మార్పుకు ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయా? అనే ఆసక్తి నెలకొంది. 

రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటుందా? అనే విషయంపై టైమ్స్ నౌ, మ్యాట్రిజ్ న్యూస్ కలిసి ఓ సర్వే చేపట్టింది. కాంగ్రెస్ తన విజయయాత్రను  కొనసాగిస్తుందని తెలిపింది.

Latest Videos

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇందులో గరిష్టంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక బీఆర్ఎస్ మాత్రం రెండు సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే పేర్కొంది. కాగా, బీజేపీ మాత్రం తన ట్యాలీని పెంచుకోనుంది. గతంలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ సారి ఐదు సీట్లను గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.

Also Read: Rahul Gandhi: ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఈ సారి హైదరాబాద్ లోక్ సభ స్థానంపై ఆసక్తి నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకు ఓటు షేరు తగ్గింది. బీజేపీకి ఓటు శాతం పెరిగింది. అందుకే ఈ సారి హైదరాబాద్ సీటుపైనా ఫోకస్ పెట్టాలని టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ పార్లమెంటు సీటులో నామమాత్రపు పోటీ కాదు.. ఈ సారి గెలవాలనే పోటీ చేయాలని అన్నారు. హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఒవైసీ తిరుగులేకుండా గెలుస్తున్నారు. అయితే.. ఈ టైమ్స్ నౌ సర్వేలో హైదరాబాద్ సీటు మళ్లీ ఎంఐఎంకే దక్కుతుందని పేర్కొంది.

ఇండియా టుడే సర్వే:

ఇండియా టుడే సర్వే కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జై కొట్టింది. నేడు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఒపీనియన్ పోల్ విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఏకంగా పది ఎంపీ సీట్లు గెలుస్తుందని పేర్కొంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ చెరో మూడు స్థానాలను గెలుచుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్, బీజేపీ సిట్టింగ్ సీట్లు గాయబ్ అవుతాయని వివరించడం గమనార్హం.

Also Read: KCR: అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా.. ఎందుకు?

2019లో మూడు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఇండియ ా టుడే ఒపినియన్ పోల్ ప్రకారం ఏడు సీట్లను అదనంగా గెలుచుకోనుంది. బీజేపీ మాత్రం ఒక సీటును కోల్పోయే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఇక బీఆర్ఎస్ 2019లో తొమ్మిది ఎంపీ సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడ్డ బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లోనూ గతంలో కంటే ఆరు ఎంపీ సీట్లను కోల్పోయే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.

click me!