రేపు తెలంగాణ కేబినెట్ భేటీ: ఉద్యోగుల పీఆర్సీ‌కి గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Jun 7, 2021, 2:21 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ అంశం రేపు జరిగే కేబినెట్ ముందుకు రానుంది.  వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్ధికశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.
 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ అంశం రేపు జరిగే కేబినెట్ ముందుకు రానుంది.  వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్ధికశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఎన్‌జీఓ సంఘం నేతలతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో   ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఇదే విషయాన్ని ఈ ఏడాది  మార్చి మాసంలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సీఎం కేసీఆర్  పీఆర్సీకి సంబంధించిన అంశాన్ని ప్రకటించారు.  ఈ ఏడాది ఏప్రిల్ 1 వ తేదీ నుండి కొత్త వేతనాలను అమలు చేస్తామని  ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనాతో లాక్‌డౌన్ విధింపు తదితర కారణాలతో ఏప్రిల్, మే మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత వేతనాలనే ప్రభుత్వం అందించింది. 

ఈ ఏడాది జూన్ మాసం నుండి కొత్త పీఆర్సీ ఆధారంగా వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్, మే మాసాల బకాయిలతో పాటు  జూన్ మాసం వేతనంతో చెల్లించనున్నారు. వేతన సవరణ నివేదికను  రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఇతరన అంశాలపై  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది.


 

click me!