ఈసీ వద్ద వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. వైఎస్సార్ టీపీగా ఆమె పార్టీ పేరును ఖరారు చేసుకున్నారు. జులై 8వ తేదీన పార్టీని ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీని ఆమె ప్రారంభించారు వైఎస్సార్ టీపీగా పార్టీ పేరు ఖరారైంది. ఈసి వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
వైఎస్సార్ టీపీ పేరుతో తనకు అభ్యంతరం లేదని వైఎస్ షర్మిల తల్లి, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ లేఖ ఇచ్చారు. ఈ లేఖను షర్మిల ఈసీకి సమర్పించారు. దీంతో పార్టీ పేరుకు అటంకాలు పూర్తయినట్లే.
undefined
తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపనకు వైఎస్ షర్మిల చాలా కాలంగా ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. పార్టీ పేరు ఖరారుకు ముందు ఆమె పలు సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. వైఎస్ అభిమానుల నుంచి, కార్యకర్తల నుంచి ఆమె అభిప్రాయాలు తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మీద వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తన పార్టీ తెలంగాణకు మాత్రమే పరిమితవుతుందని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. తెలంగాణలో రాజన్న తేవడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. రాజన్న రాజ్యం నెలకొల్పేందుకు తాను పార్టీ పెడుతున్నట్లు కూడా చెప్పారు.