ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం: భారీ వర్షాలు సహా కీలకాంశాలపై చర్చ

By narsimha lode  |  First Published Jul 31, 2023, 2:38 PM IST


తెలంగాణ కేబినెట్ సమావేశం  ఇవాళ  మధ్యాహ్నం  ప్రారంభమైంది. భారీ వర్షాలతో పాటు  పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. సుమారు  40 నుండి 50  అంశాలపై  చర్చించే అవకాశం ఉంది.


హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం  సోమవారం నాడు మధ్యాహ్నం సచివాలయంలో ప్రారంభమైంది.  కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది.  ఇటీవల కురిసిన భారీ వర్షాలు,  పంట నష్టం, ప్రత్యామ్నాయ పంటలు, ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల వంటి అంశాలపై  సమావేశంలో చర్చించనున్నారు.గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో  భారీ వర్షాలతో  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో  జరిగిన పంట, ఆస్తి నష్టంపై చర్చించనున్నారు.  భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల స్థానంలో  ప్రత్యామ్నాయ పంటల సాగుపై  కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

Latest Videos

undefined

 వచ్చే నెల  మూడో తేదీ నుండి  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని  ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై  కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.  మరో వైపు  ఆర్టీసీ ఉద్యోగుల జీత భత్యాల పెంపు  అంశంపై  కేబినెట్  చర్చించి  ఆమోదం తెలపనుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిప్పి పంపిన బిల్లుల అంశంపై  కూడ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

భారీ వర్షాలతో  నష్టపోయిన రైతులను, సాధారణ ప్రజలను  ఆదుకొనేందుకు  ఏం చేయాలనే దానిపై  కూడ కేబినెట్ సమావేశంలో  చర్చించనున్నారు.  గత  ఏడాది  పంట నష్టపోయిన రైతులకు  ఎకరానికి  రూ. 10 వేలను  ప్రభుత్వం  ప్రకటించింది.  అయితే  ఈ ఏడాది  అదే సహయం అందిస్తుందా సహాయాన్ని పెంచనుందా కేబినెట్ సమావేశం తర్వాత తేలనుంది. 

click me!