Hyderabad: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే, వర్షాలు తర్వాత కండ్లకలక బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం కండ్లకలక కేసులు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Rainfall brings surge in cases of conjunctivitis: ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే, వర్షాలు తర్వాత కండ్లకలక బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం కండ్లకలక కేసులు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కండ్లకలక కలవరం రేపుతోంది.
ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణలో ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ లో కండ్లకలక కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రజలు చేతుల పరిశుభ్రత పాటించాలనీ, కంటి ఇన్ఫెక్షన్ నుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కండ్లకలక గురించి వైద్యులు హెచ్చరిస్తూ.. ప్రజలు తమ కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు చేతుల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ.. తరచూ కండ్లను తాకకుండా ఉండాలని పేర్కొంటున్నాయి. కండ్లకలక వ్యాప్తిని నివారించడానికి, ప్రభావిత వ్యక్తులు ఉపయోగించే టవల్స్, ఇతర వ్యక్తిగత వస్తువులను ప్రజలు తాకకుండా ఉండాలన్నారు. రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలనీ, ఇది సోకిన వారు బయటకు వెళ్లకుండా ఉండటంతో వ్యక్తి నుండి వ్యక్తికి సంక్రమణ వ్యాప్తిని తగ్గించడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
కండ్లకలక సాధారణంగా ప్రమాదకరం కానప్పటికీ, ప్రభావిత వ్యక్తులు మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. సాధారణంగా, ఎటువంటి నిర్దిష్ట చికిత్స అవసరం లేకుండా ఒక వారంలో లక్షణాలు తగ్గుతాయి. అయితే, అంటువ్యాధి సమయంలో, ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాప్తి చెందుతుంది, కాబట్టి కండ్లకలకతో బాధపడుతున్నవారు ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కురిసిన వర్షాలకు కండ్లకలక కేసులు తడి, చల్లని వాతావరణంలో కంటి ఇన్ఫెక్షన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నేత్రవైద్యులు గుర్తుచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కురిసిన వర్షాల తర్వాత నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కంటి పరిశుభ్రత పాటించడానికి ప్రాధాన్యమివ్వాలనీ, ఈ సమయంలో వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
కండ్లకలక ఉన్న కొంతమంది రోగులు గొంతు నొప్పి, జ్వరాన్ని కూడా అనుభవించవచ్చు, అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.నివారణ చర్యలు తీసుకోవడం వల్ల వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చని సూచిస్తున్నారు. కంటి ఎరుపు, కంటి నుంచి నీరు రావడం, కళ్ళలో దురద, అసౌకర్యంగా ఉండటం వంటి కండ్లకలక లక్షణాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పైన పేర్కొన్నవి కండ్లకలక లక్షణాలు అయినప్పటికీ, అవి సంభవిస్తే యాంటీబయాటిక్స్ తో స్వీయ-వైద్యం చేయకపోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. ఎందుకంటే సరైన మందులు ఉపయోగించకుంటే ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.