తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వాటిని చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2022, 2:47 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏల చెల్లింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏల చెల్లింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల(కరువు భత్యం) కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 10.01 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక, సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ schools, జూనియర్ college డిగ్రీ కాలేజీల్లో fees నియంత్రణకు కొత్త చట్టం తీసుకు రావాలని తీర్మానించింది. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి  విధి విధానాలను రూపొందించేందుకు Cabinet Sub committee ఏర్పాటు చేసింది.తెలంగాణ విద్యాశాఖ మంత్రి Sabitha Indtra Reddy అధ్యక్షతన  ఈ కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుంది. 

click me!