తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై హైకోర్టు అసహనం.. కారణమిదే..

Published : Jan 18, 2022, 02:15 PM IST
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై హైకోర్టు అసహనం.. కారణమిదే..

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై (Somesh Kumar) హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగి నాగధర్ సింగ్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై (Somesh Kumar) హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగి నాగధర్ సింగ్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీతాలు ఇస్తున్నారని ఈ సందర్భంగా పిటిషనర్ వాదనలు వినిపించారు. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయనందుకు తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేశారు. 

అంతేకాకుండా.. కౌంటర్ దాఖలు చేయకపోతే వ్యక్తిగతంగా హాజరు కావాలని సీఎస్‌ను హైకోర్టు సీజే ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకపోతే మార్చి 14న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని తెలిపింది. పనిచేయించుకోకుండా జీతాలు ఇస్తే ప్రజాధనం వృథా అయినట్టేనని వ్యాఖ్యానించింది. వెయిటింగ్‌లో ఎంతమంది ఉన్నారో తెలుపాలని ఆదేశించారు. ప్రభుత్వ చర్యలేమిటో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Daughter Kills Parents: ప్రేమ పెళ్లి విషాదం.. తల్లిదండ్రులను హతమార్చిన కూతురు | Asianet News Telugu
Medaram Sammakka Saralamma Jatara 2026 Begins | 4000 Special RTC Buses | Asianet News Telugu