షాబాద్ సీతారామచంద్రస్వామి దేవాలయ భూములపై హైకోర్టులో పిల్.. 1,148 ఎకరాల పరిరక్షించాలని కోరుతూ..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2022, 1:47 PM IST
Highlights

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) షాబాద్‌ (Shabad) మండలం సీతారాంపూర్‌లోని సీతారామచంద్ర స్వామి దేవాలయ భూములపై వివాదం కొనసాగుతుంది. తాజాగా 1,148 ఎకరాల ఆలయ భూములను పరిరక్షించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) పిల్ దాఖలైంది.

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy district) షాబాద్‌ (Shabad) మండలం సీతారాంపూర్‌లోని సీతారామచంద్ర స్వామి దేవాలయ భూములపై వివాదం కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం దేవాలయ భూములు ఐటీ పార్క్‌‌కు కేటాయించడంపై వివాదం కొనసాగుతుంది. తాజాగా 1,148 ఎకరాల ఆలయ భూములను పరిరక్షించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) పిల్ దాఖలైంది. దేవాలయ భూములను కాపాడాలంటూ పిటిషన్లను హైకోర్టును కోరారు. ఈ క్రమంలోనే సీతారామచంద్ర స్వామి దేవాలయ భూముల పత్రాలను సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. 

ఇక, షాబాద్ సీతారామచంద్రస్వామి దేవాలయానికి సర్వే నంబరు 1663 నుంచి 1673 వరకు 1,148 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూముల్లో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ భూములు సాగుచేసుకుంటున్న రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం ముందుకే సాగింది. భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం కూడా ప్రారంభించింది. 

అయితే రెవెన్యూ శాఖ అధికారులు ఈ భూములను సేకరించడం చట్టవిరుద్ధమంటూ దేవాదాయ శాఖ అధికారులు లేఖ రాశారు. ఈ మేరకు గతంలోనే లేఖ రాశామని, దానిని పట్టించుకోకుండా భూ సేకరణ కొనసాగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. భూ సేకరణ కొనసాగించడాన్ని తప్పుబట్టారు. ఈ ప్రక్రియ కోర్టు ధిక్కారమే తేల్చి చెప్పారు.  

click me!