తెలంగాణ బీజేపీ (Telangana BJP)యూనిట్ పలు జిల్లాలకు అధ్యక్షులను (BJP appointed new district presidents) మార్పుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ విషయాన్ని వారికి సమాచారం అందించింది.
పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ మరింత బలోపేతం కావడంపై ఫొకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా యూనిట్లలో కీలక మార్పులు చేసింది. పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ఆఫీస్ నుంచి గురవారం సాయంత్రం ఉత్వర్వులు వెలువడ్డాయి.
అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే.. సెల్ టవర్ ఎక్కి అభిమానుల నిరసన..
ఈ ఉత్తర్వుల్లో మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించినట్టు వెల్లడించింది. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా దినేశ్ ను, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాధవ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిందరికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు.
నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లు మాత్రమే ఆహారం.. ప్రధాని మోడీ పాటిస్తున్న కఠోర నియమాలివే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లను గెలుచుకుంది. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఓటు షేర్ ను కూడా పెంచుకుంది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో మరో రెండు స్థానాల్లో విజయం సాధించింది. తాజా ఎన్నికలతో ఆ సంఖ్య 8కి పెరిగింది. వాస్తవానికి తెలంగాణలో అధికారం చేపట్టాలని ఆ పార్టీ ఎంతో ప్రయత్నించినా.. మూడో స్థానంలో మిగిలిపోయింది.
అక్షింతల్లో రేషన్ బియ్యం, బాస్మతి, జై శ్రీరామ్ రకాలుంటాయా ? - బండి సంజయ్
అయితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో పెరిగిన ఓటు షేర్ ను ఈ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే పార్టీలో అవసరమైన చోట్ల మార్పులు చేసుకుంటోంది. మరి కొన్ని జిల్లాల్లో కూడా అధ్యక్షుల మార్పు త్వరలో ఉండే అవకాశం కనిపిస్తోంది.