సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలి: టెన్త్ పేపర్ లీక్ పై బండి సంజయ్

By narsimha lode  |  First Published Apr 3, 2023, 7:51 PM IST

టెన్త్ పేపర్ లీక్ అంశంపై  బాధ్యులను కఠినంగా  శిక్షించాలని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్ డిమాండ్  చేశారు. 


 

హైదరాబాద్:రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు పేపర్ లికేజీ కావడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  పేర్కొన్నారు.బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  సోమవారంనాడు మీడియాకు   ప్రకటనను విడుదల  చేశారు. 

Latest Videos

కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షా పేపర్లు  లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తుందని  ఆయన  ఎద్దేవా  చేశారు. . తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందని ఆయన విమర్శించారు. . పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటన్నారు.  
ప్రభుత్వ చేతగానితనం   విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందని బండి  సంజయ్  చెప్పారు.కొన్ని కార్పొరేట్,  ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని  ఆయన ఆరోపించారు. 
ఈ లీకేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని ఆయన  అభిప్రాయపడ్డారు.

టెన్త్  పేపర్ లికేజ్ కు  ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్  చేశారు.  ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ  . విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే  రాజీనామా  చేయాలని ఆయన డిమాండ్  చేశారు. 

 ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయన్నారు. 
 టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్ తో  ఒకే పేపర్ గా పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఇప్పటికే  ఒత్తిడి కన్పిస్తుందన్నారు. పేపర్  లీకేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గంధరగోళం నెలకొందన్నారు.

also read:రేపు టెన్త్ క్లాస్ పరీక్ష యథాతథం: పాఠశాల విద్యాశాఖ కమిషనర్
.
మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని  ఆయన డిమాండ్  చేశారు. విద్యార్థులంతా  టెన్షన్ కు గురికాకుండా దైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలని ఆయన కోరారు. 10వ తరగతి తెలుగు పేపర్ లికేజీ పై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని  ఆయన  డిమాండ్  చేశారు. ఈ లీకేజీ వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని  ఆయన కోరారు. బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆయన  డిమాండ్  చేశారు. 
 

click me!