ఆరో తరగతి బాలుడు ఫిర్యాదు చేయడానికి రాచకొండ కమిషనరేట్‌కు వెళ్లాడు. ఆ పిల్లాడి ఫిర్యాదు స్వీకరించడానికి కమిషనర్ డీఎస్ చౌహాన్ ఐపీఎస్ స్వయంగా తన చాంబర్ నుంచి బయటకు వచ్చారు. ఆయనే స్వయంగా ఫిర్యాదు స్వీకరించారు.
హైదరాబాద్: రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ మానవత్వంతో స్పందించారు. ఆరో తరగతి బాలుడు ఫిర్యాదు చేయడానికి వస్తే ఆయన తన చాంబర్ నుంచి బయటకు వచ్చారు. ఆ బాలుడి ఫిర్యాదు స్వయంగా స్వీకరించారు. వెంటనే యాక్షన్‌లోకి దిగారు.
చేర్యాల గ్రామ పరిధిలో ఓ ప్రముఖ గురుకుల పాఠశాలలో ఫిబ్రవరిలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దుర్ఘటనలో 6వ తరగతి బాుడు తుమ్మల హనివర్ధన్ గాయపడ్డాడు. ఆ బాలుడికి వైద్యం అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
దీంతో ఆ బాలుడు కమిషనర్‌ను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కమిషనర్ డీఎస్ చౌహాన్ ఐపీఎస్ స్వయంగా స్వీకరించారు. బాలుడికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల యాజమాన్యం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని యాక్షన్‌లోకి దిగారు.
చిన్న పిల్లల సంక్షేమం, రక్షణ కోసం రాచకొండ కమిషనరేట్ ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని కమిషనర్ ఈ సందర్బంగా తెలిపారు.
Also Read: తొందరపడకు మిత్రమా.. కూల్ డౌన్: కేంద్రమంత్రి జైశంకర్‌పై శశిథరూర్ కామెంట్లు
ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన బాలుడికి తోడుగా అతని చిన్నాన్న నరేష్ రెడ్డి వచ్చాడు.