తెలంగాణ బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ నే కాదు ఆయన భార్య జమునను కూడా ఎన్నికల బరిలోకి దింపాలని బిజెపి అదిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచార జోరు పెంచింది. ఇక ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై వున్నాయి. ఈ సమయంలో బిజెపి అభ్యర్థులు వీరే అంటూ ఆసక్తికరమైన పేర్లు తెరపైకి వస్తున్నారు. ఇలా తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ భార్య జమున ఈ ఎన్నికలతో రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు బిజెపి వర్గాల సమాచారం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఎదిరించి బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చారు ఈటల రాజేందర్. ఈ క్రమంలో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల సమయంలో ఈటల జమున తెరపైకి వచ్చారు. భర్తకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేసారు. ఇలా భర్తకు మద్దతుగా తెలియకుండానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జమున ఇప్పుడు ఫుల్ టైమ్ పాలిటీషన్ గా మారనున్నారని ప్రచారం జరుగుతోంది. బిజెపి అభ్యర్ధుల వేటలో వున్న బిజెపి జమునను కూడా ఎన్నికల బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
హైదరాబాద్ శివారులోని మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేటలో ఈటల దంపతులు నివాసముంటున్నారు. అలాగే వీరి వ్యాపారాలు చాలావరకు ఈ నియోజకవర్గంలోనే వున్నాయి. దీంతో ఈటల కుటుంబానికి మేడ్చల్ లోని అన్నిపార్టీల నాయకులతో మంచి సంత్సంబంధాలు వున్నారు. దీంతో ఈటల జమునను మేడ్చల్ నుండి బరిలోకి దింపాలని బిజెపి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Read More తెలంగాణలో బీజేపీదే అధికారం: బండి సంజయ్ ధీమా
ఇక ఈటల రాజేందర్ రాజకీయ, అనుభవం... అంగబలం, అర్ధబలం జమునకు మరింత ప్లస్ అవుతాయని బిజెపి భావిస్తోందట. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలో బలమైన బిజెపి నాయకులు లేకపోవడంతో జమున పేరు తెరపైకి వచ్చింది. సామాజికవర్గాల పరంగా చూసుకున్నా జమున పోటీచేయడం కలిసివస్తుందన్న భావనతో బిజెపి వుందట. ఈటల రాజేందర్ బిసి, జమున రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారు కావడంతో ఈ రెండు వర్గాల ఓటర్లను కూడా ఆకర్షించవచ్చన్నది బిజెపి ఎత్తుగడగా తెలుస్తోంది.
ఇదిలావుంటే తన భార్య జమునను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ఈటల రాజేందర్ కూడా సుముఖంగా వున్నట్లు తెలుస్తోంది. ఆయనే స్వయంగా తన భార్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని బిజెపి అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. దీంతో ఆమెను మేడ్చల్ నియోజకవర్గం నుండి పోటీ చేయించాలని బిజెపి భావిస్తోందట.
ఆమె అభ్యర్థిత్వంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన అదిష్టానం ఫస్ట్ లిస్ట్ లోనే ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.