ప్రచార హోరు.. కేటీఆర్ కు కామారెడ్డి.. హరీశ్ రావుకు గజ్వేల్.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

By Rajesh Karampoori  |  First Published Oct 12, 2023, 8:36 AM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నవంబర్‌ 9న ఆ రెండు నియోజకవర్గాల్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అయితే.. ఆ నియోజకవర్గాల్లో ప్రచారం బాధ్యతను ఎవరు చూసుకోనున్నారనేది హాట్ టాఫిక్ గా మారింది. 


తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ప్రచారం హోరు జోరందుకుంది. పార్టీలన్నీ ప్రజాక్షేతంలోకి వెళ్లి.. తమ హామీలతో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో తమ అభ్యర్థుల జాబితాల ప్రకటనలో ప్రతిపక్షబీజేపీ, కాంగ్రెస్ లు కాస్తా గందరగోళానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ చాలా క్లారిటీగా ఉన్నారు.

ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి.. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక అక్టోబర్ 15 నుంచి ఎన్నికల ప్రచార పర్వానికి కేసీఆర్  శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీఫాంలు అందజేసి.. దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే.. అదే రోజు సాయంత్రం హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభతోనే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. 

Latest Videos

undefined

హుస్నాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార పర్వం నవంబర్ 9 వరకు కొనసాగనుంది. అంటే.. 17 రోజుల పాటు సాగనున్న ఈ ప్రచార యాత్రలో  సీఎం కేసీఆర్ 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు  చేయనున్నారు. ఈ లెక్కన చూస్తూ.. రోజుకు కనీసం రెండు లేదా మూడు నియోజక వర్గాలు కవర్ అయ్యేలా.. బీఆర్‌ఎస్‌ షెడ్యూల్‌ సిద్ధం చేసింది. 

ఇక ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నవంబర్‌ 9న ఆయన ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పార్టీకి అన్ని తానై చూసుకుంటున్న సీఎం కేసీఆర్.. తాను పోటీ చేయనున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజక వర్గ ప్రచార బాధ్యతలను ఇద్దరు మంత్రులకు అప్పగించారంట. కామారెడ్డి నియోజక వర్గ ప్రచార బాధ్యతలను మంత్రి కేటీఆర్ కు అప్పగించగా..  గజ్వేల్ నియోజకవర్గ ప్రచార బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకు అప్పగించినట్లు సమాచారం. 

తొలుత కామారెడ్డి నియోజక వర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ కవితకు అప్పగించాలని సీఎం కేసీఆర్  భావించారంట. కానీ, అక్కడి పరిస్థితుల ద్రుష్యా .. కవితను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకే పరిమితి చేయాలని, అదే బెటర్ అని భావిస్తున్నారని టాక్. దీంతో కామారెడ్డి ప్రచార బాధ్యతలను మంత్రి కేటీఆర్ కు.. ఇక గజ్వేల్ ప్రచార బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

గతంలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన నేతలు చాలా మందే ఉన్నారు. కానీ..ఇలా రెండు చోట్ల విజయం సాధించినవారు ఎవరు లేరు. కానీ, కేసీఆర్  ఆ చరిత్రను తిరగ రాయాలని భావిస్తున్నారట. కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ఒకవైపు సొంత నియోజకవర్గాలను చూసుకుంటూనే.. ఇంకోవైపు కేసీఆర్ నియోజక వర్గాల్లో కీలకంగా వ్యవహరించనున్నారు.  

click me!