గోవాకు చేరుకున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకోసమంటే..

Published : Jul 14, 2022, 12:30 PM IST
గోవాకు చేరుకున్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకోసమంటే..

సారాంశం

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు గోవా చేరుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు.. గోవా‌కు వెళ్లారు. 

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు గోవా చేరుకున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు.. గోవా‌కు వెళ్లారు. అక్కడ వారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము.. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె గురువారం గోవాకు చేరుకున్నారు. అక్కడ బీజేపీతో పాటు తనకు మద్దతు తెలపుతున్న పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము  సమావేశం కానున్నారు. 

అయితే ద్రౌపది ముర్ము తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జూలై 12 తెలంగాణకు రావాల్సి ఉంది. ఇందుకోసం టీ బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. హైదరాబాద్‌‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశంతో పాటుగా.. గిరిజన నేతలు, మేధావులు, వైద్యులు, పలువురు ప్రముఖులతో ఆమె సమావేశం అయ్యేలా ప్లాన్ చేశారు. అయితే ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన రద్దైంది. భారీ వర్షాల కారణంగా ఈ పర్యటన రద్దైనట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. 

ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చెందిన ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము ఇంటరాక్ట్ అయ్యేలా.. ఆ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే వారిని గోవాకు పిలిపించడం ద్వారా.. నేడు ద్రౌపది ముర్ముతో భేటీకి ఏర్పాట్లు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?