మల్కాజ్‌గిరి సీసీఎస్ ఎస్సై విజయ్‌ సస్పెండ్.. మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో..

Published : Jul 10, 2022, 11:21 AM IST
మల్కాజ్‌గిరి సీసీఎస్ ఎస్సై విజయ్‌ సస్పెండ్.. మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేయడంతో..

సారాంశం

ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే.. పలు కేసుల్లో నిందితులుగా మారడం చర్చనీయాంశంగా మారుతోంది. అవి కూడా మహిళ‌లపై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే.. పలు కేసుల్లో నిందితులుగా మారడం చర్చనీయాంశంగా మారుతోంది. అవి కూడా మహిళ‌లపై అత్యాచార ఆరోపణలకు సంబంధించిన కేసులు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మారేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సీఐ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుపై అత్యాచారం కింద కేసు నమోదు కావడంతో.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అతడిని సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మల్కాజ్‌గిరి సీసీఎస్ ఎస్సై ధరావత్ విజయ్‌‌పై అత్యాచారం కేసు నమోదైంది. మిర్యాలగూడలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో విజయ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో ఆరోపించారు. 

కొంతకాలం తాము హైదరాబాద్‌లో కలిసి ఉన్నామని యువతి చెబుతోంది. విజయ్‌కు గతంలో పెళ్లి అయినప్పటికీ.. ఆ విషయం దాచిపెట్టి తనతో సహజీవనం చేశాడని యువతి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. ఇక, మిర్యాలగూడ పీఎస్‌లో విజయ్‌పై కేసు నమోదు కావడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని సీపీ భగవత్ ఆదేశించారు. ఇక, గతంలో వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా విజయ్.. ఓ విషయంలో సస్పెండ్ అయినట్టుగా సమాచారం.
 

 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే