వివాహితపై రేప్: సస్పెండైన సీఐ నాగేశ్వర్‌రావుపై పలు కేసులు

By narsimha lode  |  First Published Jul 10, 2022, 10:49 AM IST


సస్పెన్షన్ కు గురైన మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్ రావుపై  పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. తనపై అత్యాచారం చేసినట్టుగా వివాహిత నాగేశ్వర్ రావు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐపై కిడ్నాప్, ఆర్మ్జ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.


హైదరాబాద్: Hyderabad నగరంలోని  హస్తినాపురంలో నివాసం ఉండే వివాహితపై Rape  చేసిన కేసులో Marredpally  ఇన్స్‌పెక్టర్  Nageshwar Raoపై  అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో నాగేశ్వర్ రావును హైద్రాబాద్ సీపీ సీవీ Anand ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

హైద్రాబాద్ నగరంలో  హస్తినాపురంలో నివాసం ఉండే వివాహితపై  అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వర్ రావుపై  పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల ఏడో తేదీన రాత్రి 12 గంటల సమయంలో  మారేడ్‌పల్లి సీఐ  నాగేశ్వర్ రావు తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది.  తన తలకు తుపాకీ గురిపెట్టి అత్యాచారం చేసినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ రిపోర్టు చేసింది. 

Latest Videos

undefined

అయితే తన భర్త ఇంటి వచ్చిన తర్వాత తన భర్త తలపై కూడా సీఐ పగులగొట్టాడని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తమను తన కారులో బలవంతంగా తీసుకెళ్తుండగా ఇబ్రహీంపట్నంలో  Car  రోడ్డు ప్రమాదానికి గురైందని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొంది.  

ఈ ప్రమాదం జరగడంతో తాము తప్పించుకొని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆమె చెప్పారు. ఒకవేళ సీఐ కారు ప్రమాదానికి గురి కాకపోవడంతో  తమను చంపేసి ఎక్కడో పడేసేవాడని ఆమె ఆరోపించారు.  అదే జరిగితే అసలు నిజాలు బయటకు వచ్చేవి కావని ఆమె చెప్పారు.

ఈ నెల వ7 తేదీన వివాహిత ఇంటికి సీఐ వచ్చిన సమయంలో ఆమె భర్త కూడా వచ్చాడు. ఈ సమయంలో గొడవ జరిగింది. అయితే భర్త రావడానికి ముందే వివాహితపై సీఐ అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొందని ఆ చానెల్ కథనాన్ని ప్రసారం చేసింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.. మారేడ్‌పల్లి  ఇన్స్ పెక్టర్ నాగేశ్వరరావుపై  అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదయ్యాయి.

also read:మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై వరుస కేసులు.. అనుమానాలు, ఇరికించే ‘‘ కుట్ర ’’ జరుగుతోందా..?

మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్ రావుపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు  ఇన్స్ పెక్టర్ పై వివాహిత ఫిర్యాదు నేపథ్యంలో హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్  సీఐ నాగేశ్వర్ రావుపై సస్పెన్షన్ వేటు వేశారు.
 

click me!