కాంగ్రెస్‌కు కేసీఆర్ సాయం.. ఇప్పటికే రూ.1000 కోట్లు, గెలిపించి బీఆర్ఎస్‌లోకి ..స్కెచ్ ఇదే : బండి సంజయ్

Siva Kodati |  
Published : May 21, 2023, 07:32 PM IST
కాంగ్రెస్‌కు కేసీఆర్ సాయం.. ఇప్పటికే రూ.1000 కోట్లు, గెలిపించి బీఆర్ఎస్‌లోకి ..స్కెచ్ ఇదే : బండి సంజయ్

సారాంశం

వచ్చే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ సహాయం చేస్తున్నారని, ఇప్పటికే రూ.1000 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను కేసీఆర్ తయారు చేస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు.   

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ సహాయం చేయనుందని ఆరోపించారు. ఇప్పటికే కేసీఆర్ కాంగ్రెస్‌కు రూ. 1000 కోట్లు ఇచ్చారని సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ వీక్‌గా వున్న చోట కాంగ్రెస్‌ను లేపుతారని.. అక్కడ హస్తం పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తారని చెప్పారు. అనంతరం గెలిచిన వ్యక్తి బీఆర్ఎస్‌లో చేరడమో, లేదా మద్ధతు ఇవ్వడమో చేస్తారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు.  

కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాను కేసీఆర్ సహాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసి కూడా కొందరు కాంగ్రెస్ నేతలు మౌనంగా వుంటున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంపై సంజయ్ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత విషయంలో కేంద్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కవిత తప్పు చేయకుంటే కేసీఆర్, కేటీఆర్‌లలో ఎవరో ఒకరు ఖండించేవారని సంజయ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది బీజేపీయేనని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: జీవో నెం.111 రద్దు వెనుక లక్షల కోట్ల స్కాం.. ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ : బండి సంజయ్ వ్యాఖ్యలు

జీవో నెంబర్ 111 ఎత్తివేతపై బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఎన్నికల ముందే జనం గుర్తుకువస్తారంటూ దుయ్యబట్టారు. పపోడు భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపలేదని.. ధరణి పోర్టల్‌తో బీఆర్ఎస్ నేతలు బాగుపడ్డారని సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఆఫీసులకు కారుచౌకగా భూములను లీజ్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కోకాపేటలో రూ. వేల కోట్ల విలువ చేసే భూములను బీఆర్ఎస్ నేతలు తీసుకుంటున్నారని.. గజం రూ.1.10 లక్షలు పలికే భూములను , బీఆర్ఎస్ కార్యదర్శికి 11 ఎకరాలను రూ. 40 కోట్లకే ఇచ్చారని సంజయ్ ఆరోపించారు. డబ్బు కోసమే జీవో నెం 111ను కేసీఆర్ రద్దు చేశారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ భూములను తీసుకున్నా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని.. కాంగ్రెస్‌కు పోటీగా ఇప్పుడు బీఆర్ఎస్ ఆ భూములను లూటీ చేసిందని సంజయ్ ఆరోపించారు. ఆ భూముల విషయాన్ని బీజేపీ వదిలిపెట్టదని.. అందులో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ పొంగిపోతోందని సంజయ్ దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్ ఆరోపించారు.

111 జీవోను ఎత్తివేయడం వెనుక లక్షల కోట్ల స్కాం దాగి వుందని ఆయన పేర్కొన్నారు. కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు దుష్ఫ్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే