బండి సంజయ్ ను మార్చే ప్రసక్తే లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published May 21, 2023, 3:19 PM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్  మార్పు ప్రసక్తే లేదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. 



హైదరాబాద్:  బీజేపీ తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షుడు బండి   సంజయ్  ను మార్చే  అవకాశం లేదని   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.. ఆదివారంనాడు  హైద్రాబాద్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ  నేతలను  కలవడం  సహజమన్నారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఆధారాలున్నందునే  మనీష్ సిసోడియాను  సీబీఐ అరెస్ట్  చేసిందని  చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత  అరెస్ట్  అంశం  తమ చేతుల్లో లేదన్నారు. దర్యాప్తు సంస్థలే  ఈ విషయంలో   నిర్ణయం తీసుకుంటాయన్నారు. మహారాష్ట్రలో  బీఆర్ఎస్ ను ఎంఐఎం నడిపిస్తుందని ఆయన  విమర్శించారు. 
రూ. 2 వేల నగదు నోట్ల నగదు  ఉపసంహరణను  అవినీతి పరులే  వ్యతిరేకిస్తున్నారన్నారు. రూ. 2 వేల నోట్ల రద్దు  వెనుక  తమ వ్యూహాలు తమకున్నాయన్నారు.  

Latest Videos

also read:పాలనను సలహదారులకు వదిలేశారు: కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్

కర్ణాటక  ఎన్నికల ప్రభావం  తెలంగాణలో  ఉండదని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  తేల్చి చెప్పారు.. కాంగ్రెస్ కు తెలంగాణలో  భవిష్యత్తు లేదన్నారు.  బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఆయన  పేర్కొన్నారు

బీజేపీకి  చెందిన రాష్ట్ర నేతలు  గత వారంలో   ఢిల్లీలో  పర్యటించారు.  బండి సంజయ్ పై  ఫిర్యాదు  చేశారని ప్రచారం  సాగింది.  బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి మార్చకపోతే  రాష్ట్రంలో  పార్టీకి మనుగడ లేదని  నేతలు  ఫిర్యాదు  చేశారని  ప్రచారం సాగింది.  అయితే  బండి  సంజయ్ ను మార్చే ప్రసక్తే లేదని  కిషన్ రెడ్డి తేల్చి  చెప్పారు.

పార్టీ జాతీయ నేతలను  కలవడంలో  ప్రత్యేకత లేదని  కిషన్ రెడ్డి  తేల్చి  చెప్పారు.   బీజేపీ  నేతలు  కొందరు  కాంగ్రెస్ పార్టీలో  చేరుతారని కూడా  ప్రచారం ప్రారంభమైంది.  ఈ తరుణంలోనే   బీజేపీ  అగ్రనేత   అమిత్ షాతో  రాష్ట్రానికి  చెందిన  బీజేపీ  నేతలు   సమావేశమయ్యారు. 

మరో వైపు  పార్టీని వీడిన  నేతలంతా   తిరిగి  కాంగ్రెస్ లో  చేరాలని  టీపీసీసీ  చీఫ్  రేవంత్ రెడ్డి కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో   చేరుతారని ప్రచారం సాగింది.  ఈ ప్రచారాన్ని  ఆయన ఖండించారు.  మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా  బీజేపీని వీడుతారని   కూడా   మీడియాలో వార్తలు వచ్చాయి.  అయితే  ఈ ప్రచారాన్ని  ఈటల రాజేందర్  తోసిపుచ్చారు.  పార్టీ మార్పు విషయమై  ఈటల రాజేందర్  ఖండించారు. 

click me!