టార్గెట్ హుజూరాబాద్... రాష్ట్ర బిజెపి చీఫ్ సంజయ్ స్పెషల్ ఫోకస్

By Arun Kumar PFirst Published Jun 7, 2021, 12:22 PM IST
Highlights

ఎట్టి పరిస్థితుల్లో హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపిని గెలిపించుకుని టీఆర్ఎస్ కు మరోసారి చెక్ పెట్టాలని భాావిస్తున్న తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. 

కరీంనగర్: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు సిద్దమైన నేపథ్యంలో తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో హుజురాబాద్ ఉపఎన్నికల్లో బిజెపిని గెలిపించుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. అందులో భాగంగానే సోమవారం హుజూరాబాద్ నియోజక వర్గంలో పర్యటించిన బండి సంజయ్. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. అలాగే పదిహేను కిలోల ఉచిత బియ్యం పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు ఇబ్బందులు పడ్డా కూడా తమకు తాము రక్షణ కల్పించుకుంటున్నారని అన్నారు. దేశం లో ఏ ఒక్క నిరుపేద వ్యక్తి ఆకలి తో అలమటించచవద్దనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారని తెలిపారు. 

read more  కొత్త ముహూర్తం: ఈ నెల 13న బిజెపిలోకి ఈటెల రాజేందర్

ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూనే మరో వైపు దేశ ప్రజలను కాపాడడం అనే విశాల దృక్పదంతో ప్రధాని ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం కింద ప్రతి నిరుపేద వ్యక్తికి నెలకు ఐదు కిలోల బియ్యం పథకం ప్రవేశ పెట్టారు. ఈ పథకం ద్వారా దేశంలో ఎనభై వేల కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది'' అని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని... ఈ ఏడాది డిసెంబర్ వరకు అందరికీ వ్యాక్సినేషన్ వేయడం పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమం సజావుగా ముందుకు వెళ్లాలనుకుంటే ప్రధానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు బండి సంజయ్.  

click me!