తాగుబోతు డ్రైవర్ భీభత్సం... పారిశుద్ద్య కార్మికులపైకి వాహనాన్నిఎక్కించి

By Arun Kumar PFirst Published Jun 7, 2021, 10:33 AM IST
Highlights

 సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో ఓ తాగుబోతు ఫూటుగా మద్యం సేవించి బొలేరో వాహనాన్ని నడిపి ఇద్దరు మహిళా పారిశుద్ద్య కార్మికులను పొట్టనబెట్టుకున్నాడు. 

సంగారెడ్డి: ఓ తాగుబోతు నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరు పారిశుధ్ద్య కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. అంతేకాదు దుకాణాలపైకి దూసుకెళ్లి ఆస్తినష్టాన్ని సృష్టించింది. చివరకు ఓ కరెంట్ స్తంబాన్ని ఢీకొట్టడంతో ఈ భీభత్సం ఆగింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో ఓ తాగుబోతు ఫూటుగా మద్యం సేవించి బొలేరో వాహనాన్ని నడిపాడు. అయితే మద్యం మత్తులో అతడు రోడ్డు ఊడుస్తున్న పారిశుద్ద్య కార్మికులను వాహనంతో ఢీకొట్టాడు. దీంతో సత్యమ్మ, విట్టమ్మ అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. 

read more  ఫలక్‌నూమా: గొంతు కోసిన దుండగులు, రోడ్డుపై పరిగెత్తుతూ కుప్పకూలిన వ్యక్తి

ఈ ప్రమాదం తర్వాత కూడా సదరు తాగుబోతు వాహనాన్ని నిలపకుండా ముందుకు పోనిచ్చాడు. దీంతో వాహనం మరోసారి అదుపుతప్పి దుకాణాలపైకి దూసుకెళ్లింది. వ్యాపారులు ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే అప్రమత్తం అవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. 

ఇలా నానా భీభత్సం సృష్టించిన వాహనం చివరకు ఓ విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో స్థానికులు తాగుబోతు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని సీఐ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి పరిశీలించారు.

click me!