ఎవరితోనన్నా లేచిపో.. లేదంటే మీ అన్నతోనే కాపురం చెయ్యి..!

Published : Jun 07, 2021, 10:05 AM IST
ఎవరితోనన్నా లేచిపో.. లేదంటే మీ అన్నతోనే కాపురం చెయ్యి..!

సారాంశం

. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో.. 2018లో దుబాయ్ వెళ్లాడు. అక్కడ సంపాదిస్తూ.. ఇక్కడ భార్య, బిడ్డలు, చెల్లెని పోషస్తున్నాడు. ఆయన చెల్లెలు శ్రీదేవి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది

తల్లిదండ్రులు చిన్నతనంలోనే కోల్పోయింది. దీంతో.. అన్న చెంతనే ఉంటూ తన జీవితం సాగిస్తోంది. అయితే.. తల్లి లాగా ఆదరించాల్సిన వదిన ఆమె పాలిట యమపాశమైంది. ఎక్కడ రూ.లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేయాల్సి వస్తుందోనని.. సూటిపోటి మాటలతో వేధించేది. ఎవరితోనైనా లేచిపోమ్మని లేదంతే.. మీ అన్నతోనే కాపురం చెయ్యి అంటూ నీచంగా మాట్లాడేది. దీంతో.. ఆమె మాటల వేధింపులు తట్టుకోలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అరవింద్, శ్రీదేవి(21) అన్నాచెల్లెల్లు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో.. చెల్లిని అన్నే చూసుకుంటున్నాడు. కాగా.. ఎనిమిదేళ్ల క్రితం అరవింద్... తన మేనత్త కూతురు మంజులను పెళ్లి చేసుకున్నాడు. 

అయితే.. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో.. 2018లో దుబాయ్ వెళ్లాడు. అక్కడ సంపాదిస్తూ.. ఇక్కడ భార్య, బిడ్డలు, చెల్లెని పోషస్తున్నాడు. ఆయన చెల్లెలు శ్రీదేవి ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. అయితే.. ఆమెకు త్వరలో పెళ్లి చేయాలని అతని అన్న భావించాడు.

పెళ్లి అంటే.. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని భావించిన మంజుల.. ఈ విషయమై భర్తతో గొడవ కూడా పడింది. అయినా అతను పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ క్రమంలో తన తల్లితో కలిసి మంజుల.. శ్రీదేవిని వేధించడం మొదలుపెట్టింది. తాము పెళ్లి చేయలేమని, పెళ్లి చేస్తే తమకు ఖర్చు తప్ప లాభం లేదని, అందుకే ఎవరితోనైనా లేచిపోవాలని మానసికంగా శ్రీదేవిని హింసించేవారు.

కాగా.. సరిగ్గా సంవత్సరం క్రితం.. దుబాయి నుంచి అరవింద్ స్వగ్రామనికి వచ్చాడు. అప్పుడు కూడా చెల్లిలి విషయంలో భార్యతో గొడవ పడ్డాడు. దీంతో.. మంజుల అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా ఫోన్ చేసి.. నీ కారణంగానే మేము విడిపోయామంటూ శ్రీదేవిని వేధించేంది. దీంతో.. తట్టుకోలేక పోయిన శ్రీదేవి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే
Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu