నల్గొండ జిల్లాలో కరోనా కలకలం.. కస్తూర్బా గాంధీ పాఠశాలలో 17 మందికి కరోనా పాజిటివ్‌..

Published : Aug 04, 2022, 04:28 PM IST
నల్గొండ జిల్లాలో కరోనా కలకలం.. కస్తూర్బా గాంధీ పాఠశాలలో 17 మందికి కరోనా పాజిటివ్‌..

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో బుధవారం కొత్తగా 992 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా 20 జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నల్గొండ జిల్లాలో కరోనా కలకలకం రేపింది.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో బుధవారం కొత్తగా 992 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా 20 జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. నల్గొండ జిల్లాలో కరోనా కలకలకం రేపింది. నేరేడుగొమ్ము కస్తూర్బా గాంధీ పాఠశాలలో 17 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కస్తూర్బా గాంధీ పాఠశాలలోని విద్యార్తులు జ్వరం, దగ్గుతో బాధ పడుతుండటంతో.. అక్కడి సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని వైద్య శాఖ అధికారులకు తెలియజేశారు. 

దీంతో కస్తూర్బా గాంధీ పాఠశాలకు చేరుకున్న వైద్య సిబ్బంది.. విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఒక ఉపాధ్యాయురాలికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రలు పాఠశాల వద్దకు చేరుకుంటున్నారు. 

ఇక, తెలంగాణలో బుధవారం 41,182 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 992 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,22,663కి చేరింది. కొత్త కేసుల్లో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 376 ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 54, రంగారెడ్డిలో 65 కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సంగారెడ్డి, పెదపల్లి.. జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి.

బుధవారం కరోనా నుంచి 852 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిరవకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య సంఖ్య 8,12,420కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,132గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2.4 శాతం, రికవరీ రేటు 98.7 శాతంగా ఉన్నాయి. కొత్తగా మరణాలు నమోదు కాకపోవడంతో మరణాల సంఖ్య 4,111గా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Renu Desai Fire on Media: మీడియా పైరెచ్చిపోయిన రేణు దేశాయ్ | Asianet News Telugu
Renu Desai Strong Comments On Street Dogs: కుక్కల మరణాలపై రేణు దేశాయ్ ఉగ్రరూపం | Asianet News Telugu