
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోనే సిట్ విచారణ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు . మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరుగుతుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ప్రెస్‌మీట్‌ను హైకోర్టు కూడా తప్పుబట్టిందన్నారు. సిట్ దర్యాప్తు పురోగతిని బహిర్గతపర్చకూదదని, ఈ నెల 29 లోపు పురోగతిని సీల్డ్ కవర్‌లో సింగిల్ జడ్జికి సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తప్పు చేసిన వాళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందేనని.. వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read:మొయినాబాద్ ఫామ్ కేసు.. సీబీఐ విచారణకు నో.. సిట్‌కు పలు షరతులు విధించిన హైకోర్టు..
కాగా... మొయినాబాద్ ఫామ్ కేసును దర్యాప్తుకు సంబంధించి మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణకు ఏర్పాటైన సిట్ దర్యాప్తును కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశాలు ఆదేశించింది.
సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చూడేలని హైకోర్టు తెలిపింది. దర్యాప్తు వివరాలను మీడియా, ప్రభుత్వ వర్గాలు, రాజకీయ నాయకులకు వెల్లడించొద్దని ఆదేశించింది. దర్యాప్యు పురోగతి నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు విషయంలో మర్యాద, గోప్యతను కాపాడుకోవడం సిట్ చైర్మన్ బాధ్యత అని పేర్కొంది.
అయితే ఈ కేసుకు సంబంధించి సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో తెలంగాణ హోం శాఖ సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. అయితే సిట్ విచారణపై కూడా బీజేపీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ తమ పిటిషన్‌ను ముందుగా నిర్ణయించకుండా సింగిల్ జడ్జి తెలంగాణ పోలీసుల విచారణకు అనుమతించడం పట్ల తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రేమేందర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితులు ముగ్గురితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు.