ఆసిఫాబాద్ జిల్లాలో పులి పంజా.. వృద్ధుడిని చంపి, అడవుల్లోకి ఈడ్చుకెళ్లి

Siva Kodati |  
Published : Nov 15, 2022, 05:41 PM IST
ఆసిఫాబాద్ జిల్లాలో పులి పంజా.. వృద్ధుడిని చంపి, అడవుల్లోకి ఈడ్చుకెళ్లి

సారాంశం

ఆసిఫాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఓ వ్యక్తిపై దాడి చేసిన పులి అతన్ని చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని పులి చంపింది . ఖానాపూర్ సమీపంలో దాడి చేసిన పులి .. అడవిలోకి లాక్కెళ్లింది. మృతుడు ఖానాపూర్‌కు చెందిన భీముగా గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు సైతం ఈ ఘటనను ధ్రువీకరించారు. పులి దాడిలోనే అతను చనిపోయినట్లు తెలిపారు. అయితే ఈ ఏరియాలో గత కొన్నిరోజులుగా పులి తిరుగుతోంది. పశువులపై దాడులు చేస్తూ వస్తోన్న పులి.. ఇవాళ ఏకంగా మనిషిని చంపడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీ, పోలీస్ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. రెండేళ్ల క్రితం దిగిడలో ఓ వ్యక్తిని పులి చంపేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పులి కోసం అప్పుడు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!