హీరో కృష్ణ మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.ఇవాళ హీరో కృష్ణ పార్థీవదేహనికి నివాళులర్పించారు.
హైదరాబాద్:టాలీవుడ్ హీరో కృష్ణ మకుటం లేని మహరాజు అని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.టాలీవుడ్ హీరో కృష్ణ పార్థీవ దేహనికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారంనాడు నివాళులర్పించారు. కృష్ణ కుటుంబసభ్యులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఓదార్చారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.రాజకీయాల్లో కూడా కృష్ణ రాణించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. సినిమారంగంలో హీరో కృష్ణ అనేక ప్రయోగాలకు కేంద్రంగా నిలిచారన్నారు.డేరింగ్,డాషిం గ్ హీరోగా కృష్ణ పేరొందన్నారు.
ప్రముఖ చలనచిత్ర నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి పార్థివదేహానికి నానక్ రామ్ గూడ లోని వారి నివాసంలో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. pic.twitter.com/MSImDvh5p6
— Talasani Srinivas Yadav (@YadavTalasani)70ఎంఎం,సినిమా స్కోప్, ఈస్ట్ మన్ కలర్ సినిమాలను కూడా కృష్ణ తీసుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు.అల్లూరిసీతారామరాజు,సింహసనం వంటి సినిమాలు కృష్ణ సినీ జీవితంలో మర్చిపోలేనిదన్నారు. మహేష్ బాబు కుటుంబంలో ఏడాదిలోపుగా ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు.కృష్ణ మృతి తెలుగు సినీపరిశ్రమకు తీరనిలోటన్నారు.ఏలూరునుండి ఆయన ఎంపీగా విజయంసాధించి ప్రజలకు సేవ చేశారన్నారు.మహేష్ బాబు లాంటి కొడుకు ఉండడం కృష్ణ అదృష్టంగా ఆయన పేర్కొన్నారు.