ఈ నెల 18న తెలంగాణ బడ్జెట్: 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు బీఎసీ నిర్ణయం

By narsimha lodeFirst Published Mar 15, 2021, 2:14 PM IST
Highlights

పది రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.సోమవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తెలంగాణ బీఎసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


హైదరాబాద్: పది రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.సోమవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తెలంగాణ బీఎసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ నెల 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 18వ తేదీన  బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని  బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ నెల 16న అసెంబ్లీ సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.ఈ నెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు.ఈ నెల 20 నుండి బడ్జెట్ తో పాటు పద్దులపై చర్చించనున్నారు. ఈ నెల 26న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.

ఇదిలా ఉంటే 25 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన బీఎసీ సమావేశంలో కోరారు. అంతేకాదు 

న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య , రాయలసీమలిఫ్ట్ ఇరిగేషన్, పెట్రోల్ ధరలపై చర్చించాలని ఆయన కోరారు.

click me!