న్యాయవాద దంపతుల హత్య కేసు.. హైకోర్టు షాకింగ్ కామెంట్స్

By telugu news teamFirst Published Mar 15, 2021, 2:11 PM IST
Highlights

వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో ఈ కోర్టుకు అంతే ఉందన్న ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు ఇప్పటివరకు సరైన దిశలోనే సాగుతొందని హైకోర్టు పేర్కొంది. ఇప్పుడు సీబీఐకి కి అప్పగిస్తే సమయం వృధానేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు న్యాయవాదులు అతి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.  న్యాయవాది వామనరావు, ఆయన భార్య నాగమణిని నడిరోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేసి చంపేశారు. కాగా.. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది.

న్యాయవాది దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోందని సీజే ధర్మాసనం పేర్కొంది. 

వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో ఈ కోర్టుకు అంతే ఉందన్న ధర్మాసనం పేర్కొంది. దర్యాప్తు ఇప్పటివరకు సరైన దిశలోనే సాగుతొందని హైకోర్టు పేర్కొంది. ఇప్పుడు సీబీఐకి కి అప్పగిస్తే సమయం వృధానేనని న్యాయస్థానం అభిప్రాయపడింది.

వామన్ రావు, నాగమణి హత్యల దర్యాప్తుపై ఏజీ న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు.నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామని పోలీసులు న్యాయస్థానానికి వివరించారు. 
బిట్టు శీను, లచ్చయ్య వాంగ్మూలాల నమోదు కోసం కోర్టులో  దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. 

కుంట శీను, చిరంజీవిలను సాక్షులు గుర్తించే ప్రక్రియ పూర్తి చేశామని పోలీసులు చెప్పారు.సిసి టీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్ కి పంపించామని చెప్పారు. 

నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రత్యక్ష సాక్షులకు పోలీసు భద్రత కల్పించాంమని చెప్పారు. కొందరు సాక్షులు పోలీసు భద్రతను నిరాకరించారని వారు పేర్కొన్నారు. మూడు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తిస్తున్నామని చెప్పారు.

బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామన్నారు.ఏడో నిందితుడిని కూడా చేర్చి అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. కాగా.. పోలీసులు చెప్పిన విషయాలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. 

click me!